AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంస్కృతం మాట్లాడితే డయాబిటిస్, కొవ్వు తగ్గుతుందట

సంస్కృతం మాట్లాడితే డయాబిటిస్, కొవ్వు తగ్గుతుందని బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని ఓ విద్యా సంస్థ చేసిన రీసెర్చ్‌లో ఈ విషయం తేలిందని ఆయన అన్నారు. సంస్కృతం మాట్లాడటం వలన నరాల వ్యవస్థను పెంచుతుందని.. దాని వలన డయాబిటిస్, కొవ్వు అదుపులో ఉంటుందని గణేష్ సింగ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కంప్యూటర్ ప్రోగ్రామ్‌లో సంస్కృతాన్ని ఉపయోగించినట్లైతే, అది ఆగకుండా పని చేస్తుందని ఆయన చెప్పారు. ఈ విషయం నాసా చేసిన ఓ సర్వేలో […]

సంస్కృతం మాట్లాడితే డయాబిటిస్, కొవ్వు తగ్గుతుందట
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 13, 2019 | 2:13 PM

Share

సంస్కృతం మాట్లాడితే డయాబిటిస్, కొవ్వు తగ్గుతుందని బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని ఓ విద్యా సంస్థ చేసిన రీసెర్చ్‌లో ఈ విషయం తేలిందని ఆయన అన్నారు. సంస్కృతం మాట్లాడటం వలన నరాల వ్యవస్థను పెంచుతుందని.. దాని వలన డయాబిటిస్, కొవ్వు అదుపులో ఉంటుందని గణేష్ సింగ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కంప్యూటర్ ప్రోగ్రామ్‌లో సంస్కృతాన్ని ఉపయోగించినట్లైతే, అది ఆగకుండా పని చేస్తుందని ఆయన చెప్పారు. ఈ విషయం నాసా చేసిన ఓ సర్వేలో తేలిందని గణేష్ వెల్లడించడం మరో విశేషం.

ఇక పలు ఇస్లామిక్ భాషలు సహా ప్రపంచంలోని 97శాతం భాషలు సంస్కృతం నుంచే పుట్టాయని గణేష్ అన్నారు. మరోవైపు దీనిపై కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి మాట్లాడుతూ.. సంస్కృత భాష మాట్లాడేందుకు చాలా ఉంటుందని, అందులో ఒక్కో పదాన్ని ఎన్నో విధాలుగా వాడుకోవచ్చని తెలిపారు. బ్రదర్, కౌ అనే ఇంగ్లీష్ పదాలు కూడా ఈ భాష నుంచే పుట్టినవేనని చెప్పుకొచ్చారు.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే