ఈ ఏనుగు భలే తెలివైంది..? రైల్వే గేటును సున్నితంగా ఎత్తేసి మరీ..

జంతువులు నోరులేనివే..కానీ, బుద్దిలో మాత్రం మనిషిని మించి తెలివితేటలు చూపిస్తాయి. అవసరాలకునుగుణంగా మూగజీవాలు తమ నైపుణ్యం ప్రదర్శిస్తుంటాయి. అడవులు అంతరించిపోయి, మైదానం బాటపట్టిన వన్యమృగాలు చేసే చిత్ర విచిత్రాలు అనేకం ఇప్పుడు ఆశ్యర్యాన్ని కలిగిస్తున్నాయి.. ఇటీవల ఓ ఏనుగుల గుంపు అడవిలోకి వెళ్లేందుకు దారిలేక..ఏకంగా ఎత్తైన ప్రహారీ గోడ దూకివెళ్లిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది. కొద్ది రోజుల క్రితం ఓ ఏనుగు పశ్చిమబెంగాల్‌లోని ఓ మిలటరీ క్యాంటీన్‌లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించింది. చివరకు అక్కడి సిబ్బంది […]

ఈ ఏనుగు భలే తెలివైంది..? రైల్వే గేటును సున్నితంగా ఎత్తేసి మరీ..
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 13, 2019 | 7:36 PM

జంతువులు నోరులేనివే..కానీ, బుద్దిలో మాత్రం మనిషిని మించి తెలివితేటలు చూపిస్తాయి. అవసరాలకునుగుణంగా మూగజీవాలు తమ నైపుణ్యం ప్రదర్శిస్తుంటాయి. అడవులు అంతరించిపోయి, మైదానం బాటపట్టిన వన్యమృగాలు చేసే చిత్ర విచిత్రాలు అనేకం ఇప్పుడు ఆశ్యర్యాన్ని కలిగిస్తున్నాయి.. ఇటీవల ఓ ఏనుగుల గుంపు అడవిలోకి వెళ్లేందుకు దారిలేక..ఏకంగా ఎత్తైన ప్రహారీ గోడ దూకివెళ్లిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది. కొద్ది రోజుల క్రితం ఓ ఏనుగు పశ్చిమబెంగాల్‌లోని ఓ మిలటరీ క్యాంటీన్‌లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించింది. చివరకు అక్కడి సిబ్బంది చాకచక్యంతో కర్రకు నిప్పు పెట్టి దాని ఎదురుగా నిలబడితే భయంతో క్యాంటీన్ నుంచి బయటకు పరుగులు తీసింది. అయితే అక్కడి మనుషులకు మాత్రం ఎలాంటి హానీ తలపెట్టలేదు. ఆ వీడియో కూడా వైరల్‌ అయింది. తాజాగా మరో గజరాజు వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది.

ఓ గజరాజు అలా దారి గుండా వెళుతుండగా రైల్వే లెవెల్ క్రాస్ ఎదురైంది. మరికొన్ని క్షణాల్లో రైలు వస్తుందనగా రైల్వేగేట్ పడింది. ఇక ఆ గేటును విరగొట్టే శక్తి ఉన్నప్పటికీ.. ఆ ఏనుగు ఎంతో సున్నితంగా తన తొండంతో గేటును ఎత్తింది. ఆ తర్వాత దానికింద నుంచి వెళ్లి పట్టాలు దాటింది. ఇక అవతల వైపు కూడా గేటు ఉండటంతో దాని పైనుంచి ఎగిరి స్మూత్‌గా దాటుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఒకరు ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వీడియో అప్‌లోడ్‌ అయిన కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో వీక్షించిన నెటిజన్లు లైకులు, కామెంట్లు చేశారు. కానీ, కొందరు జంతుప్రేమికులు మాత్రం ఏనుగు రైలుదాటుతున్న టైమ్‌లో ట్రెయిన్‌ వచ్చుంటే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ ఏనుగు సేఫ్‌గా, రైల్వే గేటును ఎత్తిన దృశ్యాలు మాత్రం అందరినీ ఆకర్షిస్తున్నాయి.