Odisha Train Accident: ‘ఒడిశా రైలు ప్రమాదానికి కారణాన్ని గుర్తించాం.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

|

Jun 04, 2023 | 1:05 PM

ఒడిశా రైలు ప్రమాదానికి దారి తీసిన కారణాన్ని కనుగొన్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆదివారం (జూన్‌ 4) మీడియాకు తెలిపారు. ఒరిస్సాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద స్థలంలో కొనసాగుతోన్న సహాయక చర్యలను మంత్రి ఈ రోజు..

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదానికి కారణాన్ని గుర్తించాం.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌
Odisha Train Accident
Follow us on

భువనేశ్వర్‌: ఒడిశా రైలు ప్రమాదానికి దారి తీసిన కారణాన్ని కనుగొన్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆదివారం (జూన్‌ 4) మీడియాకు తెలిపారు. ఒరిస్సాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద స్థలంలో కొనసాగుతోన్న సహాయక చర్యలను మంత్రి ఈ రోజు పర్యవేక్షించారు. రైలు ప్రమాదంపై విచారణ పూర్తయిందని, రైల్వే సేఫ్టీ కమిషనర్‌కు నివేదిక అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు.

‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ (EI) సిస్టమ్’లో మార్పు కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా వచ్చామని వెల్లడించారు. రైల్వే సిగ్నలింగ్ పాయింట్ లో ఎవరో మార్పులు చేశారు. మెయిన్‌లైన్‌లోకి వెళ్లేందుకు కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్‌ ఇచ్చినప్పటికీ అది టేకాఫ్‌ కావడంతో రైలు లూప్‌ లైన్‌లోకి ప్రవేశించి అక్కడ ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఢీకొట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. బాధ్యులను త్వరలపై త్వరలో చర్యలు తీసుకుంటాం. బుధవారం ఉదయానికి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈరోజు రైలు పట్టాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశామన్నారు. 7 పొక్లెయిన్ మెషీన్లు, రెండు ప్రమాద సహాయ రైళ్లు, మూడు-నాలుగు రైల్వే, రోడ్ క్రేన్‌ల సహాయంతో శిథిలాలను తొలగించేందుకు వినియోగిస్తున్నామని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మూడు రైళ్లు ఢీ కొన్న సంగతి తెలిసిందే. రెండు ప్యాసింజర్ రైళ్లు (బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్) ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 300లకు చేరువలో ఉంది. 1,175 మందికి పైగా క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు రైలు ప్రమాదంలో మరణించిన రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌ గ్రేషియా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. తీవ్ర గాయాలపాలైన వారికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అందిస్తామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.