Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha train accident: రైలు ప్రమాదంలో 237 మంది మృతి.. రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన కేంద్రం..

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 50 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. అలాగే 350 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఒడిశాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. రాత్రి 7.15కి ఒడిశాలోని బహనాగ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది కోరమండల్ ఎక్స్‌ప్రెస్.

Odisha train accident: రైలు ప్రమాదంలో 237 మంది మృతి.. రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన కేంద్రం..
Train Accident
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Jun 03, 2023 | 11:02 AM

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 237 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. అలాగే 900 మంది పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఒడిశాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. రాత్రి 7.15కి ఒడిశాలోని బహనాగ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది కోరమండల్ ఎక్స్‌ప్రెస్. పట్టాలు తప్పి లూప్‌లైన్‌లో ఉన్న గూడ్స్‌ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో పట్టాలు తప్పి పక్క ట్రాక్‌పైకి దూసుకెళ్లాయి కొన్ని బోగీలు. ఈ పట్టాలు తప్పిన బోగీలను యశ్వంత్‌పూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. యశ్వంత్‌పూర్‌-హౌరా ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులకూ గాయాలయ్యాయి.

హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్‌ సూపర్‌ఫాస్ట్‌కి మొదట ప్రమాదం జరిగింది. బాలాసోర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో 237 మంది మృతి చెందగా.. 900 మంది పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం..

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే, క్షతగాత్రులకు రూ. 2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ప్రమాదంపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించారు. ప్రమాదంపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హృదయ విదారకంగా దృశ్యాలు..

ఘటనా స్థలంలో హృదయ విదారకంగా దృశ్యాలు ఉన్నాయి. పలు బోగీలు పల్టీలు కొట్టడంతో తీవ్ర విషాదం నెలకొంది. సహాయక చర్యల్లో భాగంగా ఎయిర్‌ఫోర్స్‌ను కూడా రంగంలోకి దించారు. అత్యవసర సేవలు అవసరమైన వారిని ఎయిర్ లిఫ్ట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సహాయ చర్యల కోసం భద్రక్‌ నుంచి అంబులెన్స్‌లు పంపించారు. వివిధ చోట్ల నుంచి వచ్చిన 60కిపైగా అంబులెన్స్‌లలో గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించారు. NDRF బృందాల్ని కూడా సహాయ చర్యల కోసం రంగంలోకి దించారు.

ఇలా ప్రమాదం జరిగింది..

ఈ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ షాలీమార్‌ నుంచి చెన్నై వెళ్తోంది. మధ్యాహ్నం 3.20 సమయంలో అక్కడి నుంచి బయలుదేరింది. బహగాన స్టేషన్‌కు 7.15కి చేరుకుంది. ఆ సమయంలో పట్టాలు తప్పి లూప్‌ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ను ఢీకొట్టింది. కోరమాండల్‌ ఎక్‌ప్రెస్‌కి మొత్తం 24 బోగీలు ఉండగా.. అందులో 12 స్లీపర్స్, 6 ఏసీ కోచ్‌లు, 3 జనరల్ సిటింగ్‌తోపాటు మరికొన్ని బోగీలున్నాయి. ఈ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గరిష్టవేగం 120 కిలోమీటర్లు. బాలాసోర్‌ సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. ప్రమాదానికి కారణాలు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఉన్నతాధికారులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ప్రముఖుల దిగ్భ్రాంతి..

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ శనివారం నాడు రైలు ప్రమాద స్థలిని సందర్శించనున్నారు. ఇప్పటికే రైల్వే ఉన్నతాధికారులంతా అక్కడికి చేరుకుని సహాయ చర్యల్ని సమీక్షిస్తున్నారు. ఇక కోరమండల్‌ రైలు ప్రమాదంపై బెంగాల్‌ సీఎం మమత కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..