Puri Jagannath temple: కార్తిక శుక్రవారం ఎఫెక్ట్‌! పూరీ జగన్నాద క్షేత్రంలో తొక్కిసలాట.. 10 మందికి గాయాలు

|

Nov 10, 2023 | 4:50 PM

ఒడియా పంచాంగం ప్రకారం గత పౌర్ణమి నుంచి కార్తిక మాసం ప్రారంభమైంది. కార్తిక శుక్రవారం పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున పూరీ జగన్నాథ స్వామి ఆలయానికి వచ్చారు. ఈ క్రమంలోనే పూరీ శ్రీమందిర్‌లో ఉదయం ‘మంగళ ఆలటి’ నిర్వహించారు. దీంతో భక్తులు ఒక్కసారిగా లోపలికి ప్రవేశించేందుకు పోటెత్తారు. పెద్దసంఖ్యలో భక్తులు ఎగబడటంతో ఆలయం మెట్ల వద్ద తొక్కిసలాట జరిగింది. వెంటనే గమనించిన పోలీసులు అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ తొక్కిసలాటలో..

Puri Jagannath temple: కార్తిక శుక్రవారం ఎఫెక్ట్‌! పూరీ జగన్నాద క్షేత్రంలో తొక్కిసలాట.. 10 మందికి గాయాలు
Stampede At Puri Jagannath Temple
Follow us on

కటక్‌, నవంబర్‌ 10: ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథస్వామి ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం జగన్నాథస్వామి ఆలయం వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను పూరీ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకెళ్తే..

ఒడియా పంచాంగం ప్రకారం గత పౌర్ణమి నుంచి కార్తిక మాసం ప్రారంభమైంది. కార్తిక శుక్రవారం పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున పూరీ జగన్నాథ స్వామి ఆలయానికి వచ్చారు. ఈ క్రమంలోనే పూరీ శ్రీమందిర్‌లో ఉదయం ‘మంగళ ఆలటి’ నిర్వహించారు. దీంతో భక్తులు ఒక్కసారిగా లోపలికి ప్రవేశించేందుకు పోటెత్తారు. పెద్దసంఖ్యలో భక్తులు ఎగబడటంతో ఆలయం మెట్ల వద్ద తొక్కిసలాట జరిగింది. వెంటనే గమనించిన పోలీసులు అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ తొక్కిసలాటలో పది మంది భక్తులు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

నిజానికి.. ఆలయం వెలుపల వేచిఉన్న భక్తులందరినీ ఒకేసారి లోపలికి అనుమతించడంలో ఆలయంలోని సతపహచా సమీపంలో తొక్కిసలాట జరిగింది. శ్రీమందిర్ వెలుపల, ఆలయ ప్రాంగణంలోని శతపహచా ముందు బారికేడ్లు ఉన్నాయి. అయితే, నటమండపం ద్వారం వద్ద బారికేడ్లు లేవు. సింఘ్‌ ద్వారం నుంచి బైసిపహచా దాటి సతపహచా చేరుకుని నటమండపం వైపు నుంచి జై-బిజయ్ ద్వారం దాటేంత వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నటమండపం నుంచి జై-బిజయ్ ద్వార వరకు ఎలాంటి బారికేడ్లు లేకపోవడంతో ఆ ప్రాంతంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నటమండపం లోపల జే-బిజయ్ ద్వారం, ఆపై భీతారకథ వరకు భక్తులకు మార్గనిర్దేశం చేసేందుకు స్టీల్ బారికేడ్‌లు, తాళ్లు ఏర్పాటు చేయాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.