Cyber crime: అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగం అన్నారు.. రూ. 25 లక్షలు కొట్టేశారు..
పుణెకు చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తి సుమారు 20 ఏళ్లుగా ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఉద్యోగం మారాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పలు జాబ్ పోర్టల్స్‌లో తన ప్రొఫైల్స్‌ను పోస్ట్ చేశాడు. ఉద్యోగం మారాలనకుంటున్న అందులో పేర్కొన్నాడు. దీంతో ఈ ఏడాది మార్చి నెలలో అతనికి ఒక రిక్రూట్‌మెంట్ సంస్థలో పనిచేస్తున్నానని ఒక కాల్ వచ్చింది. ఓ అంతర్జాతీయ కార్ల కంపెనీ భారత్‌లోని తన యూనిట్‌లో...
పెరుగుతోన్న టెక్నాలజీతో పాటు రోజురోజుకీ నేరాలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. మనుషులు అత్యాశే పెట్టుబడిగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రపంచంలో ఎక్కడో కూర్చొని కోట్లాది రూపాయలను కొట్టేస్తున్నారు. ఉద్యోగాల పేరిట డబ్బులు కాజేస్తున్న సంఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కేవలం నిరుద్యోగులే కాకుండా అప్పటికే ఉద్యోగంలో ఉన్న వారు కూడా ఈ సైబర్ నేరాల బారినపడుతుండడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా ఇలాంటి ఓ సంఘటనే మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. ఉద్యోగం పేరిట మోసపోయిన ఓ ఉద్యోగి ఏకంగా రూ. 24 లక్షలు కోల్పోయాడు. ఇంతకీ ఈ స్కామ్ ఎలా జరిగిందంటే..
పుణెకు చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తి సుమారు 20 ఏళ్లుగా ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఉద్యోగం మారాలని నిర్ణయించుకున్నాడు. దీంతో పలు జాబ్ పోర్టల్స్‌లో తన ప్రొఫైల్స్‌ను పోస్ట్ చేశాడు. ఉద్యోగం మారాలనకుంటున్న అందులో పేర్కొన్నాడు. దీంతో ఈ ఏడాది మార్చి నెలలో అతనికి ఒక రిక్రూట్‌మెంట్ సంస్థలో పనిచేస్తున్నానని ఒక కాల్ వచ్చింది. ఓ అంతర్జాతీయ కార్ల కంపెనీ భారత్‌లోని తన యూనిట్‌లో సీనియర్ పొజిషన్ కోసం కాల్ చేస్తున్నట్లు సదరు ఎంప్లాయ్ తెలిపారు. మీ పేరు ఈ జాబ్ కోసం షార్ట్‌లిస్ట్ అయ్యిందని పుణెకు చెందిన వ్యక్తికి ఫోన్ చేశారు.
అతను ఉద్యోగానికి సెలక్ట్ అయ్యాడంటూ నమ్మబలుకుతూ.. జాబ్ అప్లికేషన్‌లో భాగంగా పోర్టల్‌లో రూ. 1600 చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది. అనంతరం టెలిఫోన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎంపికైనట్లు తెలిపారు. అనంతరం యునిఫాం, ఫుల్ బాడీ చెకప్ పేరుతో రూ. లక్షల పంపించాలని కోరారు. దీంతో వెనకా ముందు ఆలోచించకుండా డబ్బులు పంపించేశాడు.
అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, జాయినింగ్ ఫార్మాలిటీల పేరుతో మళ్లీ డబ్బులు పంపమని అడిగారు. గ్లోబల్ కార్ల కంపెనీ అని చెప్పడం, భారీ శాలరీ ప్యాకేజీ ఇస్తున్నారని అనగానే ఆలోచించకుండానే స్కామర్లు అడిగినంత డబ్బులు పంపిస్తూ వచ్చాడు. ఇలా 40 లావాదేవీల్లో ఏకంగా ఊ. 24 లక్షలు చెల్లించాడు. తీర నెలలు గడుస్తున్నా అపాయింట్‌మెంట్ లెటర్ రాకపోయే సరికి విషయం అర్థమైన బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ నేరస్తులు ఈ నేరానికి పాల్పడేందుకు ఫేక్ ఈమెయిల్ ఐడీ, ఫేక్ ఫోన్ నెంబర్‌ను క్రియేట్ చేశారు. అంతేకాకుండా గ్లోబల్ కార్ల తయారీ కంపెనీ పేరుతో ఓ ఫేక్ వెబ్‌సైట్‌ను కూడా క్రియేట్ చేశారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..