AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: సృజనాత్మకత ప్రేమించండి.. స్థానికతను ప్రోత్సహించండి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

ఈ ఏడాది దీపావళి పండుగ సందర్బంగా దేశ ప్రజలు అందరూ స్థానికంగా తయారు చేసిన వస్తువులనే కొనుగోలు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. దేశంలో తయారైన వస్తువులను కొనడమే కాకుండా వాటితో సెల్ఫీ ఫోటోలు కూడా దిగాలని సూచించారు.

PM Modi: సృజనాత్మకత ప్రేమించండి.. స్థానికతను ప్రోత్సహించండి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
Pm Narendra Modi
Balaraju Goud
|

Updated on: Nov 10, 2023 | 2:13 PM

Share

దీపావళి అంటే దీపాల పండుగ. హిందువుల ప్రధాన పండుగలలో ఒకటైన దీపావళిని దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. ఏడాది కూడా దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాదు మోడీ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తిని చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో ‘వోకల్ ఫర్ లోకల్’ను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది దీపావళిని దేశంలోని భారతీయుల కోసం ప్రత్యేకంగా మార్చాలని ప్రధాని మోదీ అన్నారు.

ఈ మేరకు ప్రధాని నరంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. “వాస్తవానికి, 140 కోట్ల మంది భారతీయుల కృషి గురించి ఈ దీపావళిని చేద్దాం. పారిశ్రామికవేత్తల సృజనాత్మకత, అలసిపోని స్ఫూర్తి కారణంగానే మనం #VocalForLocal తో భారతదేశ పురోగతిని నడిపించగలము.” ఈ ఏడాది దీపావళి పండుగను సంబరంగా జరుపుకుందామని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోకల్‌ ఫర్‌ వోకల్‌ అనే నినాదానికి మద్దతు ఇచ్చేందుకు ఈ దీపావళి పండగకు దేశ ప్రజలంతా.. స్థానికంగా తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

దీంతో పాటు, @kiranshaw అనే వినియోగదారు షేర్ చేసిన వీడియోను ప్రధాని మోడీ రీపోస్ట్ చేశారు. ఈ వీడియోలో, ప్రజలు స్థానిక విషయాలపై దృష్టి పెట్టాలని, వాటిని తమ ఎంపికగా మార్చుకోవాలని కోరారు. “#VocalForLocal మిషన్, దానితో వచ్చే సృజనాత్మకతను ప్రేమించండి! ఈ దీపావళికి భారతీయ పారిశ్రామికవేత్తలు, వ్యాపారాలపై లక్ష్మీదేవి తన ఆశీర్వాదాలను కురిపిస్తుంది!” అంటూ రాసుకొచ్చార ప్రధాని మోదీ.

అలాగే ఈ ఏడాది దీపావళి పండుగ సందర్బంగా దేశ ప్రజలు అందరూ స్థానికంగా తయారు చేసిన వస్తువులనే కొనుగోలు చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. దేశంలో తయారైన వస్తువులను కొనడమే కాకుండా వాటితో సెల్ఫీ ఫోటోలు కూడా దిగాలని సూచించారు. ఆ ఫోటోలను నమో యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు ప్రధాని. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా స్పందనలు భారీగా వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…