Assistant Collector Missing Case: జలాశయంలో తేలిన మహిళా అసిస్టెంట్‌ కలెక్టర్‌ మృతదేహం! అసలేం జరిగిందంటే..

రూర్కెలా అసిస్టెంట్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సుస్మిత మింజ్‌ (35) మిస్సిగ్‌ వ్యవహారం విషాదాంతమైంది. సుస్మిత మింజ్‌ మృతదేహం అనుమానాస్పద రీతిలో రూర్కెలాలోని సుందర్‌ఘడ్‌ రాష్ట్రంలోని సెంచూరియన్‌ పార్కు వద్ద ఉన్న జాలశయంలో మంగళవారం (సెప్టెంబర్‌ 19) లభ్యమైంది. దీంతో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సుస్మిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుస్మితను కొంత మంది అధికారులు..

Assistant Collector Missing Case: జలాశయంలో తేలిన మహిళా అసిస్టెంట్‌ కలెక్టర్‌ మృతదేహం! అసలేం జరిగిందంటే..
Assistant Collector Susmita Minj Murder Case
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 22, 2023 | 10:48 AM

రూర్కెలా, సెప్టెంబర్ 22: రూర్కెలా అసిస్టెంట్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సుస్మిత మింజ్‌ (35) మిస్సిగ్‌ వ్యవహారం విషాదాంతమైంది. సుస్మిత మింజ్‌ మృతదేహం అనుమానాస్పద రీతిలో రూర్కెలాలోని సుందర్‌ఘడ్‌ రాష్ట్రంలోని సెంచూరియన్‌ పార్కు వద్ద ఉన్న జాలశయంలో మంగళవారం (సెప్టెంబర్‌ 19) లభ్యమైంది. దీంతో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సుస్మిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుస్మితను కొంత మంది అధికారులు మానసికంగా వేధించడం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటుందని.. లేదంటే అసిస్టెంట్‌కలెక్టర్‌ ఆఫీస్‌లోని అధికారులు ఆమెను హతమార్చి జలాశయంలో విసిరేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

కాగా ఈ నెల 15 (శనివారం)న విధులకు వెళ్లిన సుస్మిత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో సుస్మిత కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 16వ తేదీన పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. ఆ తర్వాత ఆమె నగరంలో ఒక హోటల్లో ఉన్నట్లు సెప్టెంబర్ 19వ తేదీన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. తల్లి, సోదరుడు హోటల్‌కి వెళ్లి ఆమెను కలవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆఫీస్‌లో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, తనకు విశ్రాంతి కావాలని, తాను ఎవరినీ కలుసుకోవాలనుకోవడం లేదని తెలిపారు.

అనంతరం నగరంలో ఉన్న సెంచరీ పార్కు ప్రాంగణంలోని జలాశయంలో మంగళవారం సాయంత్రం ఆమె మృతదేహం తేలుతూ కనిపించింది. దీంతో పార్కు సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. అగ్నిమాపక సిబ్బందిని తీసుకుని వచ్చి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. జలాశయం ఒడ్డున మృతురాలి హ్యాండ్‌బ్యాగ్‌, చెప్పులు లభించాయి. అనంతరం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఆఫీస్‌లో ఆమెను మానసికంగా వేధించడం వల్లనే తన కూతురు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మా కూతురుని తిరిగి బ్రతికించుకోలేం.. కానీ మాకు న్యాయం జరగాలంటూ మృతురాలి తల్లి సెలెవ్‌స్టిన్ మింజ్ డిమాండ్‌ చేశారు. దీనిపై ఇప్పటి వరకు రూర్కెలా కలెక్టర్‌ ఆఫీస్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ పోలీసులు తెలిపారు. కాగా అసిస్టెంట్‌ కలెక్టర్‌ సుస్మిత మింజ్‌ రాజగంగపూర్‌ ప్రాంతానికి చెందిన మహిళ.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.