Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Minister Ajay Mishra: కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి.. Watch Video

కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి జరిగింది. అవును, లఖీంపూర్‌ ఘటనే ఇందుకు కారణం.

Central Minister Ajay Mishra: కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి.. Watch Video
Ajay Mishra
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 31, 2021 | 3:59 PM

కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి జరిగింది. అవును, లఖీంపూర్‌ ఘటనే ఇందుకు కారణం. ఉత్తర ప్రదేశ్‌ టు ఒడిశా.. ఇలా అన్ని చోట్లా ఆందోళనలు కొనసాగుతున్నాయి.కేంద్రమంత్రి ఎక్కిడికి వెళ్లినా నిరసనలు హోరెత్తుతున్నాయి. తాజాగా  కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా ఒడిశా పర్యటనకు వెళ్లారు. ఆయన కాన్వాయ్‌ వెళ్తుండగా NSUI విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడి పోలీసులు కంట్రోల్‌ చేసినా.. ఒక విద్యార్థి సెక్యూరిటీ జోన్‌ను దాటుకుని రోడ్డుపైకి వచ్చాడు. కేంద్రమంత్రి ప్రయాణిస్తున్న కారుపై మూడు కోడి గుడ్లు విసిరాడు.

కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా లఖీంపూర్‌లో ఆందోళన చేస్తున్న అన్నదాతలపైకి అజయ్‌మిశ్రా తనయుడు వేగంగా కారు పోనివ్వడంతో పలువురు రైతులు మృతి చెందారు. దీంతో తీవ్రస్థాయిలో ఉద్రిక్తలు చెలరేగాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఆ ఘటనపై విచారణ కూడా కొనసాగుతోంది. మరోవైపు.. లఖీంపూర్‌ ఘటనకు అజయ్‌మిశ్రా నైతిక బాధ్యత వహించాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీ విద్యార్థి విభాగం NSUIకి చెందిన కొందరు.. ఒడిశా పర్యటనలో కేంద్రమంత్రికి నల్లబ్యాడ్జీలు ప్రదర్శించి నిరసన తెలిపారు.

Also Read: IND vs NZ: ఫైనల్‌ లెవెన్‌‌పై కోహ్లీ సంకేతాలు.. వారు విమర్శకుల నోరు మూయిస్తారా..?

‘డాడీ.. మమ్మల్ని వదిలి వెళ్లావా’.. కన్నీటి పర్యంతమైన పునీత్ కుమార్తె