ఒడిశా సర్కార్ మరో కీలక నిర్ణయం..!
దేశవ్యాప్తం కరోనా బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. దీంతో ఒడిశా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులను గుర్తించేందుకు వీలుగా ఇంటింటి సర్వే చేయించాలని సర్కారు నిర్ణయించింది. తక్కువ లక్షణాలున్న కొవిడ్ రోగులకు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ హోం క్వారంటైన్‌కు అనుమతిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దేశవ్యాప్తం కరోనా బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. దీంతో ఒడిశా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులను గుర్తించేందుకు వీలుగా ఇంటింటి సర్వే చేయించాలని సర్కారు నిర్ణయించింది. తక్కువ లక్షణాలున్న కొవిడ్ రోగులకు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ హోం క్వారంటైన్‌కు అనుమతిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. అసింప్టమాటిక్ కొవిడ్ రోగులకు హోం ఐసోలేషన్ కు అనుమతిస్తూ ఒడిశా ఆరోగ్యశాఖ అదనపు చీఫ్ సెక్రటరీ ప్రదీప్త కుమార్ మహాపాత్ర ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నాలుగునెలలకు సరిపడేలా మందులను ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉంచామని మహాపాత్ర చెప్పారు.
రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నందున ఒడిశా ప్రభుత్వం కొవిడ్ రోగులకు సదుపాయాలను పెంచుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా రోగులను గుర్తించేందుకు వీలుగా ఇంటింటి సర్వే చేయించాలని ఒడిశా సర్కార్ నిర్ణయించింది. లక్షణాలున్న కరోనా రోగులను గుర్తించి వారికి వెంటనే చికిత్స అందించడం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏమాత్రం కరోనా లక్షణాలున్న వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర ప్రజలను కోరింది సర్కార్. అలాగే కరోనా చికిత్స కోసం ప్లాస్మా థెరపీని ప్రారంభించింది. ఇందుకోసం బెర్హంపూర్, భువనేశ్వర్ నగరాల్లో ప్లాస్మా బ్యాంకులను ఒడిశా ప్రభుత్వం ప్రారంభించింది. కరోనా నుంచి కోలుకున్నవారు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని అధికారులు కోరుతున్నరు. ఫ్లాస్మా దానం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడినవారవుతున్నారని అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే కరోనా రోగుల కోసం 6,580 గ్రామ పంచాయతీల్లో కొవిడ్ కేర్ హోమ్స్ సిద్ధం చేశామని, వీటిలో 65,965 పడకలను ఏర్పాటు చేశామని ఒడిశా ప్రభుత్వ ఉన్నాతాధికారులు వివరించారు.




