ఎన్నారై భర్త ఘాతుకం.. క్యాన్సర్‌కు ఫారిన్‌లో ట్రీట్‌మెంట్ చేయించమన్న భార్యను.. దారుణంగా..

గత కొంతకాలం నుంచి ఉషా క్యాన్సర్ తో బాధపడుతోంది. ఈ క్రమంలో గర్భాశయ క్యాన్సర్‌కు చికిత్స కోసం అమెరికాకు తిరిగి వెళ్దామంటూ భర్తను పలుమార్లు కోరింది. అందుకు కిరణ్ నిరాకరించాడు.

ఎన్నారై భర్త ఘాతుకం.. క్యాన్సర్‌కు ఫారిన్‌లో ట్రీట్‌మెంట్ చేయించమన్న భార్యను.. దారుణంగా..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 14, 2023 | 5:04 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. క్యాన్సర్ తో బాధపడుతున్న భార్య.. ఫారిన్‌లో చికిత్స చేయించాలని కోరినందుకు ఓ ఎన్నారై భర్త అత్యంత దారుణంగా చంపాడు. భర్త కత్తితో పొడిచి భార్యను చంపి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అహ్మదాబాద్ సర్ఖేజ్ పోలీసులు వెల్లడించారు. ఈ షాకింగ్ ఘటన బుధవారం అర్థరాత్రి మకర్బాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. కిరణ్ భౌ (72), ఉషా భౌ(69) భార్యాభర్తలు.. విదేశాల్లో ఉన్న వీరిద్దరూ సర్ఖేజ్ పరిధిలో నివసిస్తున్నారు. గత కొంతకాలం నుంచి ఉషా క్యాన్సర్ తో బాధపడుతోంది. ఈ క్రమంలో గర్భాశయ క్యాన్సర్‌కు చికిత్స కోసం అమెరికాకు తిరిగి వెళ్దామంటూ భర్తను పలుమార్లు కోరింది. అందుకు కిరణ్ నిరాకరించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రాడంతో.. కిరణ్ భార్యను కత్తితో పలుమార్లు పొడిచి అత్యంత కిరాతకంగా చంపాడు. అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కిరణ్ ఆత్మహత్య చేసుకునేందుకు తనకు తాను కత్తితో పొడుచుకుని.. డ్రామాలాడాడని పోలీసులు తెలిపారు. ఉష ముఖం, ఛాతీ, పొట్ట, మణికట్టుపై తీవ్ర గాయాలు కాగా, కిరణ్‌కు మణికట్టు, మెడ, కడుపుపై గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. మేమ్‌నగర్‌కు చెందిన ఉషా సోదరుడు మధుసూదన్ సోని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్ఖేజ్ పోలీసులు హత్య కేసుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కిరణ్, ఉష కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లో సుమారు 30 సంవత్సరాలు నివసించి.. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం అహ్మదాబాద్ ప్రహ్లాద్‌నగర్‌లోని ఒక ఇంట్లో నివసిస్తున్నారని సోనీ చెప్పారు. నాలుగు నెలల క్రితం వారు మకర్బాలోని ఆర్కిడ్ ఎక్సోటికా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌కు మారారని.. ఉష యూఎస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతోందన్నారు. దీనికి షాహిబాగ్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని.. చికిత్స కోసం US తిరిగి వెళ్దామని ఆమె పట్టుబట్టడంతో కిరణ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని మృతురాలి సోదరుడు పేర్కొన్నాడు. అమెరికాకు తిరిగివెళ్లే విషయంలో కిరణ్ తనతో గొడవపడ్డాడని ఉష తనతో తరచూ చెబుతుండేదని ఆయన చెప్పారు.

ఉషను హత్య చేసిన అనంతరం కిరణ్.. గురువారం ఉదయం బంధువులకు ఉష సూసైడ్‌ చేసుకుందంటూ మెసేజ్‌ పంపాడని.. అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పాడు. వెంటనే అక్కడకు చేరుకున్న బంధువులు కిరణ్, ఉషలను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఉష చనిపోగా.. కిరణ్ పరిస్థితి విషమంగా ఉందని సోని చెప్పారు. కిరణ్ మొదట ఉషను హత్య చేసి, ఆపై కత్తితో పొడుచుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం కిరణ్ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడని.. సర్ఖేజ్ పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..