చిదంబరానికి హైకోర్ట్ షాక్.. ఇక అరెస్ట్ తప్పదా..!
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్‌కు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. మూడు రోజుల పాటు తాత్కాలిక రక్షణ ఇవ్వాలని చిదంబరం పిటిషన్‌లో కోరారు. కాగా, ముందస్తు బెయిలుకు హైకోర్టు నిరాకరించడంతో చిదంబరాన్ని అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చిదంబరంను ప్రశ్నించేందుకు వీలుగా ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ ఇప్పటికే కోరింది. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న […]
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్‌కు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. మూడు రోజుల పాటు తాత్కాలిక రక్షణ ఇవ్వాలని చిదంబరం పిటిషన్‌లో కోరారు. కాగా, ముందస్తు బెయిలుకు హైకోర్టు నిరాకరించడంతో చిదంబరాన్ని అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చిదంబరంను ప్రశ్నించేందుకు వీలుగా ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ ఇప్పటికే కోరింది.
గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశీ నిధులు పొందేందుకు.. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు క్లియరెన్స్ ద్వారా క్లియరెన్స్ ఇప్పించారు చిదంబరం. దీనికి బదులుగా చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం కంపెనీలకు.. ఐఎన్ఎక్స్ మీడియా యాజమాన్యం పీటర్ మరియు ఇంద్రాణి ముఖర్జీ రూ. 305 కోట్లు నిధులు మళ్ళించినట్లు ఆరోపణలున్నాయి. అయితే ఈ కేసులో చిదంబరంపై అవినీతి ఆరోపణలు, నిబంధనలకు విరుద్దంగా నిధుల మళ్ళింపుపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది.