కర్ణాటకకు వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన అంతరాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలపై ఆంక్షలను ఇటీవల ఎత్తేసిన విషయం తెలిసిందే.
Restrictions lift Karnataka: కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన అంతరాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలపై ఆంక్షలను ఇటీవల ఎత్తేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పక్క రాష్ట్రాలకు వెళ్లే వ్యక్తులు, వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఓ లేఖను రాశారు. ఈ నేపథ్యంలో కర్ణాటకకు వెళ్లే ప్రయాణికులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. ఆంక్షల సడలింపుల్లో భాగంగా అంతరాష్ట్ర రాకపోకలపై ఇప్పటివరకు విధించిన నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఇకపై కర్ణాటకకు వెళ్లే వారికి కరోనా లక్షణాలు లేకపోతే హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని, చేతిపై స్టాంప్‌లు వేయబోమని, సింధు పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి ఈ-పాస్ కోసం దరఖాస్తు చేయాల్సిన పనిలేదని తెలిపింది.
అయితే ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే హోం క్వారంటైన్‌లో ఉండి ఆప్తమిత్ర హెల్త్ లైన్ నంబర్(14410)కి ఫోన్ ద్వారా గానీ, డాక్టర్లను సంప్రదించి గానీ చికిత్స పొందొచ్చని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో వచ్చేవారికి సైతం కరోనా టెస్ట్‌లు చేయబోమని వెల్లడించింది. అయితే మాస్క్, భౌతిక దూరం వంటి నిబంధనలను అందరూ పాటించాలని ప్రభుత్వం పేర్కొంది.
Read More:
ఇవాళ బెంగళూరుకు జగన్.. రేపు కూడా అక్కడే ఉండనున్న సీఎం
గెలవలేమని తెలిసే బాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు: ఎమ్మెల్యే శ్రీదేవి