యూపీలో సామూహిక కార్యక్రమాలపై సెప్టెంబర్ 30 వరకు నిషేధం

దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పటి వరకు మూడు మిలియన్లకు చేరువగా కరోనా కేసులు నమోదయ్యాయి. అటు కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో రాబోయే సెప్టెంబర్ 30 వరకు బహిరంగ కార్యక్రమాలు, మతపరమైన వేడుకలు, రాజకీయ సమావేశాల నిర్వ‌హ‌ణ‌ను నిషేధించారు.

యూపీలో సామూహిక కార్యక్రమాలపై సెప్టెంబర్ 30 వరకు నిషేధం
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 25, 2020 | 12:29 PM

దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పటి వరకు మూడు మిలియన్లకు చేరువగా కరోనా కేసులు నమోదయ్యాయి. అటు కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో రాబోయే సెప్టెంబర్ 30 వరకు బహిరంగ కార్యక్రమాలు, మతపరమైన వేడుకలు, రాజకీయ సమావేశాల నిర్వ‌హ‌ణ‌ను నిషేధించారు. విగ్రహాల ఆవిష్క‌ర‌ణ లాంటి బహిరంగ కార్య‌క్ర‌మాల‌కు కూడా అనుమ‌తి లేదు. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను అదనపు ప్రధాన కార్యదర్శి అవ‌నీష్‌ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే అన్ని రకాల ఊరేగింపులు నిషేధించిన‌ట్లు ఆ ఉత్త‌ర్వుల‌లో పేర్కొన్నారు. ఈ ఉత్త‌ర్వుల‌ను అన్ని జిల్లా న్యాయాధికారులు, పోలీసు కమిషనర్లు, ఏడీజీ జోన్, ఐజీ, డీఐజీ రేంజ్ అధికారుల‌కు పంపారు. దీని ప్ర‌కారం రాష్ట్రంలోని అన్ని మత ప్రదేశాలలో ప్ర‌త్యేక భద్రతా ఏర్పాట్లు చేయ‌నున్నారు. ముఖ్యంగా మధుర, అయోధ్య, వార‌ణాసిల‌పై పోలీసులు దృష్టి సారించ‌నున్నారు. సంఘ వ్యతిరేక శ‌క్తులపై నిఘా ఉంచాలని పోలీసుల‌కు ప్ర‌భుత్వం సూచనలు చేసింది. క‌రో‌నా వ్యాప్తిని అరిక‌ట్టే దిశగా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ప్రజలంతా సామూహిక దూరం పాటించి కరోనా నియంత్రణకు సహకరించాలని ప్రభుత్వం కోరింది.