AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News: ఆ జిల్లాలో ఏడాది తర్వాత కొవిడ్ మరణాలు జీరో… హెర్డ్ ఇమ్యునిటీ కారణమా?

కరోనా సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం అందరికీ ఊరట కలిగిస్తోంది. అదే సమయంలో కొవిడ్‌‌కు సంబంధించి మరో తీపి కబురు అందుతోంది.

Good News: ఆ జిల్లాలో ఏడాది తర్వాత కొవిడ్ మరణాలు జీరో... హెర్డ్ ఇమ్యునిటీ కారణమా?
Janardhan Veluru
|

Updated on: Jun 21, 2021 | 11:58 AM

Share

Covid-19 Herd Immunity: కరోనా సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం అందరికీ ఊరట కలిగిస్తోంది. అదే సమయంలో కొవిడ్‌‌కు సంబంధించి మరో తీపి కబురు అందుతోంది. గతంలో రోజుకు పైగా కరోనా మరణాలు నమోదైన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లాలో ఆదివారంనాడు ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఆ జిల్లాలో 348 రోజుల(దాదాపు సంవత్సర కాలం) తర్వాత కరోనా మరణాలు లేకపోవడం విశేషం. మూడు మాసాల క్రితం ఆ జిల్లాలో రోజూ 100కు పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పుడు జిల్లాలో కొవిడ్ మరణాలు సున్నాకు చేరడానికి హెర్డ్ ఇమ్యునిటీ ప్రభావమే దీనికి కారణమని వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రస్తుత వాతావరణం కూడా వైరల్ ఇన్ఫెక్షన్లకు అనుకూలంగా లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నాగ్‌పూర్ నగరంలో వరుసగా మూడో రోజు కరోనా మరణాలు సంభవించలేదు. ఆ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా ఎనిమిదో రోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు నాగ్‌పూర్ జిల్లాలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ గత రెండు రోజుల్లో(శుక్ర, శనివారాలు) ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆదివారంనాడు ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు ఎవరూ కూడా నాగ్‌పూర్‌లో కొవిడ్ కారణంగా మరణించలేదు. 2020 జులై 6 తర్వాత ఆ జిల్లాలో కొవిడ్ మరణం నమోదుకాకపోవడం ఇదే తొలిసారి. ఆ జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,76,761 కాగా..ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 907గా ఉంది. చాలా రోజుల తర్వాత యాక్టివ్ కేసులు 1000 కంటే దిగువునకు చేరాయి. ఆదివారంనాడు 8857 పరీక్షలు నిర్వహించగా 39 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. నాగ్‌పూర్ జిల్లాలో ఫిబ్రవరి మూడో వారంలో సెకండ్ వేవ్ ప్రారంభంకాగా…ఏప్రిల్ 19న అత్యధికంగా 113 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి.

Covid Test

Covid Test

సెకండ్ వేవ్‌లో చాలా మంది కరోనా బారినపడి కోలుకున్నారని..దీంతో పాటు గత రెండు మాసాల్లో జిల్లాలో 10 లక్షలకు పైగా వ్యాక్సిన్లు తీసుకున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు కారణాలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో హెర్డ్ ఇమ్యునిటీ వచ్చుండే అవకాశముందని చెప్పారు. హెర్డ్ ఇమ్యునిటీ సాధించిన వ్యక్తుల ద్వారా కొవిడ్ వైరస్…ఇతరులకు వ్యాపించే అవకాశం లేదని చెప్పారు. జిల్లాలో వాణిజ్య కార్యక్రమాలు జూన్ 1 నుంచి ప్రారంభించినప్పటికీ…వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేలా జనసమూహాలు గుమికూడే కార్యక్రమాలేవీ జరగకపోవడం కూడా దీనికి కారణమని వైద్యులు విశ్లేషిస్తున్నారు.

Also Read..

India Corona Cases: దేశంలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు, మరణాలు.. కొత్తగా ఎన్నంటే.!