సాయంత్రం 4 గం. నిర్మ‌లా సీతారామ‌న్ మీడియా స‌మావేశం..నేటి కీల‌క అంశాలు

సాయంత్రం 4 గం. నిర్మ‌లా సీతారామ‌న్ మీడియా స‌మావేశం..నేటి కీల‌క అంశాలు

ఇవాళ మ‌రో రంగానికి సంబంధించిన‌ ఆర్థిక ప్యాకేజీ వివ‌రాల‌ను ఆమె వెల్ల‌డించ‌నుండ‌గా, ఏం ప్ర‌క‌టిస్తార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

Jyothi Gadda

| Edited By:

May 14, 2020 | 3:29 PM

ఇవాళ కూడా సాయంత్రం 4 గంట‌ల‌కు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఇవాళ మ‌రో రంగానికి సంబంధించిన‌ ఆర్థిక ప్యాకేజీ వివ‌రాల‌ను ఆమె వెల్ల‌డించ‌నుండ‌గా, ఏం ప్ర‌క‌టిస్తార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. విడ‌త‌ల వారీగా ఆర్థిక ప్యాకేజీ వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని నిన్న‌టి మీడియా స‌మావేశంలో నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. కాగా, నిన్న కంపెనీల‌ల‌కు ప‌లు వ‌రాలు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అయితే, ఇవాళ్టి ప్రెస్ మీట్‌లో ఏ అంశాల‌ను ప్రాధాన్యంలోకి తీసుకుంటార‌నే దానిపై ప‌లువురు విశ్లేష‌కులు వారి వారి అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు .ఇందులో ముఖ్యంగా వ్య‌వ‌సాయ రంగానికి అధిక‌ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. మ‌రో ప్ర‌ధాన అంశం డిమాండ్ అండ్ స‌ప్లై మీద కూడా కేంద్ర ఆర్థిక మంత్రి ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, రూ. 20ల‌క్ష‌ల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వ‌ల్ల దేశంలోని ప్ర‌తి ఒక్క‌రు లాభ‌ప‌డ‌తార‌ని ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో సామాన్య ప్ర‌జ‌లు ప‌లు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నిన్న చేసిన ప్ర‌క‌ట‌న‌లో సామాన్యుడికి నేరుగా ఎలాంటి లాభం క‌లుగ‌లేదంటూ సోష‌ల్ మీడియా వేదికగా ప‌లువురు కామెంట్లు పెడుతున్నారు. వ‌ల‌స కూలీల‌కు, పేద‌ల‌కు ఎలాంటి శుభ‌వార్త వినిపించ‌లేదు. దీంతో ఆర్థిక ప్యాకేజీ లెక్క‌ల సంగ‌తి ఏమో కానీ, త‌మ‌కేమైనా లాభం క‌లిగిందా అంటూ సామాన్యుడు ప్ర‌శ్నిస్తున్న‌ట్లు నెట్టింట్లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ మ‌రోమారు మీడియా ముందుకు వ‌స్తున్న సీత‌మ్మ సామాన్యుల‌ను క‌రుణిస్తుందేమో చూడాలి మ‌రీ అంటూ వాపోతున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu