Vande Bharat Express: 2 గంటలు కాదు.. ఇకపై కేవలం 30 నిమిషాల్లోనే! వందేభారత్ రైలులో ఆ స్టేషన్ చేరుకోవచ్చు!

కాన్పూర్, లక్నో మధ్య రెండు గంటల ప్రయాణాన్ని 30 లేదా 45 నిమిషాలకు తగ్గించాలని రైల్వేశాఖ యోచిస్తోంది. ప్రస్తుతం, రెండు నగరాల మధ్య 110 రైళ్లు నడుస్తున్నాయి..

Vande Bharat Express: 2 గంటలు కాదు.. ఇకపై కేవలం 30 నిమిషాల్లోనే! వందేభారత్ రైలులో ఆ స్టేషన్ చేరుకోవచ్చు!
Follow us

|

Updated on: Feb 18, 2023 | 6:54 PM

ఉత్తరప్రదేశ్‌లోని అనేక నగరాలను వందే మెట్రో సర్వీస్ అనుసంధానం చేయనుంది. కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. నివేదికల ప్రకారం, లక్నో- సీతాపూర్, లక్నో- కాన్పూర్ మధ్య వందేభారత్ మెట్రో రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనితో పాటు కాన్పూర్, సీతాపూర్, రాయ్ బరేలీ, బరేలీలను హైస్పీడ్ కారిడార్ ద్వారా అనుసంధానించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇదే సాధ్యమైతే.. ఇకపై లక్నోను మరింత సులభంగా చేరుకోవచ్చు.

రైల్వే పూర్తి ప్రణాళిక ఇలా..

హైస్పీడ్ మెట్రో కారిడార్ ద్వారా లక్నో, కాన్పూర్‌లను అనుసంధానించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాన్పూర్, లక్నో మధ్య రెండు గంటల ప్రయాణాన్ని 30 లేదా 45 నిమిషాలకు తగ్గించాలని రైల్వేశాఖ యోచిస్తోంది. ప్రస్తుతం, రెండు నగరాల మధ్య 110 రైళ్లు నడుస్తున్నాయి. లక్నో, కాన్పూర్ ఉత్తర ప్రదేశ్ వాణిజ్య, సాంస్కృతిక కేంద్రాలుగా పేరొందాయి. ఈ రెండు నగరాల మధ్య ప్రతిరోజూ పెద్ద ఎత్తున వస్తువులు, వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు చేస్తుంటారు.

అంతకుముందు లక్నో, కాన్పూర్ మధ్య RRTS రైళ్లను ప్రారంభించాలని పరిపాలన పరిశీలిస్తోంది. అయితే, ఆ ప్రతిపాదన ఇప్పుడు రద్దు అయింది. దాని స్థానంలోనే ఇప్పుడు వందేభారత్ ప్రాజెక్టు కింద వందే మెట్రో రైళ్లను నడపాలని యోచిస్తోంది. లక్నో-సీతాపూర్ కారిడార్ నిర్మాణానంతరం 89 కి.మీ దూరం ప్రయాణించాలంటే ఇకపై కేవలం 50 నిమిషాలు మాత్రమే పడుతుంది. దీంతో రెండు నగరాల్లోనూ భారీ పెట్టుబడులు రావడంతో పాటు వేగంగా మార్పులు కూడా చోటు చేసుకుంటాయి.

రైలు మార్గం ఎలా ఉంటుంది?

ఈ రైళ్ల కోచ్‌లు రాజధాని ఎక్స్‌ప్రెస్ తరహాలో ఉంటాయి. పాత కోచ్‌ల స్థానంలో 200 కొత్త కోచ్‌లు రానున్నాయి. ఇది కాకుండా, భారతీయ రైల్వే ఢిల్లీ-కాన్పూర్, లక్నో మధ్య వందేభారత్ రైలును కూడా నడుపుతుంది. ఢిల్లీ-లక్నో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ బరేలీ, మొరాదాబాద్‌ స్టేషన్లలో ఆగుతుంది. ఆ కాన్పూర్‌, లక్నోకు చేరుకుంటుంది. వందేభారత్ రైలులో ఆటోమేటిక్ డోర్లు, ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, రివాల్వింగ్ కుర్చీలు ఉంటాయి. GPS వ్యవస్థ, CCTV కెమెరాలు, వాక్యూమ్ బయోవాక్యూమ్ వాష్‌రూమ్‌లు కూడా ఉన్నాయి. ఈ రైలులో హైటెక్ టెక్నాలజీతో పాటు ఫ్రీ వైఫై సౌకర్యం ఉంది.