ఢిల్లీ తొక్కిసలాట ఘటన..రూ.10లక్షల పరిహారం ప్రకటించిన రైల్వేశాఖ.. రాష్ట్రపతి సంతాపం

రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. మృతులంతా బీహార్‌, ఢిల్లీ వాసులుగా అధికారులు గుర్తించారు. పేర్లతో సహా మృతుల వివరాలు వెల్లడించారు. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఇండియన్‌ రైల్వే ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం, తీవ్ర గాయాలైనవారికి రూపాయలు..

ఢిల్లీ తొక్కిసలాట ఘటన..రూ.10లక్షల పరిహారం ప్రకటించిన రైల్వేశాఖ.. రాష్ట్రపతి సంతాపం
Delhi Railway Station

Updated on: Feb 16, 2025 | 8:33 AM

దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శనివారం రాత్రిబాగా పొద్దుపోయిన తరువాత హస్తిన నగరం అల్లకల్లోలంగా మారింది. ప్రయాణికుల రద్దీతో ఢిల్లీ రైల్వే స్టేషన్‌ రణరంగంగా మారింది. ప్రయాణికుల మధ్య తీవ్ర తొక్కిసలాట జరిగింది. దీంతో పిల్లలు, పెద్దలు, మహిళలు సహా 18మంది ప్రాణాలు కోల్పోయారు. మహా కుంభమేళ కోసం బయల్దేరిన భక్తులు ఊహించని ప్రమాదంతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళా కోసం రైళ్లు ఎక్కడానికి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చేరుకున్నాడు. ప్రయాణికులు అకస్మాత్తుగా గుమిగూడడంతో శనివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మహిళలు, నలుగురు పిల్లలు సహా 18 మంది మరణించగా, డజనుకు పైగా గాయపడ్డారు. జరిగిన ఈ దురదృష్టకర సంఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా, రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. మృతులంతా బీహార్‌, ఢిల్లీ వాసులుగా అధికారులు గుర్తించారు. పేర్లతో సహా మృతుల వివరాలు వెల్లడించారు. మృతుల్లో ఆహాదేవి, పింకి దేవి, షీలా దేవి, వ్యోమ్‌, పూనమ్‌ దేవి, లలితా దేవి, సురుచి, కృష్ణదేవి, విజయ్‌, నీరజ్‌, శాంతిదేవి, పూజాకుమార్, పూనమ్, సంగీతామాలిక్‌, మమతాఝా, రియాసింగ్‌, బేబీకుమారి, మనోజ్‌గా గుర్తించారు. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఇండియన్‌ రైల్వే ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం, తీవ్ర గాయాలైనవారికి రూ.2.5లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్టుగా ప్రకటించారు. అలాగే, స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్న వారికి రూ. లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది రైల్వేశాఖ.

ఇవి కూడా చదవండి

రైల్వే్స్టేషన్లో ఫిబ్రవరి 15 రాత్రి తొక్కిసలాట జరిగింది. కుంభమేళాకు వెళ్తున్న భక్తులు రైల్వే స్టేషన్ కు పోటెత్తడంతో 14,15 ఫ్లాట్ ఫామ్ లదగ్గర తొక్కిసలాట జరిగింది. ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్న రైల్లు రద్దయ్యాయనే వదంతులతో జనం ఒక్కసారిగా గందరగోళానికి గురవ్వడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ నంబర్ 14 వద్ద నిలబడి ఉన్నప్పుడు, ప్లాట్‌ఫామ్ వద్ద చాలా మంది ప్రజలు ఉన్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఆలస్యంగా వచ్చాయి. ఈ రైళ్ల ప్రయాణికులు ప్లాట్‌ఫామ్ నంబర్ 12, 13 , 14 వద్ద కూడా ఉన్నారు. సమాచారం ప్రకారం 1500 జనరల్ టిక్కెట్లు అమ్ముడయ్యాయని, అందుకే జనసమూహం అదుపు తప్పినట్టుగా రైల్వే అధికారులు వెల్లడించారు… ప్లాట్‌ఫామ్ నంబర్ 14 వద్ద , ప్లాట్‌ఫామ్ నంబర్ 1 సమీపంలోని ఎస్కలేటర్ దగ్గర తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) రైల్వే, తెలిపారు.

ఢిల్లీ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ట్వీట్‌లో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం జరిగిందని తెలిసి తీవ్ర బాధ కలిగింది. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..