NEET 2023 Answer Key: నీట్‌ (యూజీ)-2023 ఆన్షర్‌ ‘కీ’ విడుదల.. మరో వారం రోజుల్లో రిజల్ట్స్‌!

|

Jun 05, 2023 | 3:54 PM

దేశవ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరానికి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ-2023 ప్రవేశ పరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ 'కీ' విడుదలైంది. పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్లో ఆన్సర్‌ 'కీ'ని డౌన్‌లోడ్‌ చేసుకోవల్సిందిగా..

NEET 2023 Answer Key: నీట్‌ (యూజీ)-2023 ఆన్షర్‌ కీ విడుదల.. మరో వారం రోజుల్లో రిజల్ట్స్‌!
NEET UG Answer Key 2023
Follow us on

దేశవ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరానికి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ-2023 ప్రవేశ పరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ విడుదలైంది. పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్లో ఆన్సర్‌ ‘కీ’ని డౌన్‌లోడ్‌ చేసుకోవల్సిందిగా ఎన్టీయే సూచించింది. కాగా మే 7న (ఆదివారం) నీట్ యూజీ పరీక్ష మొత్తం 4097 సెంటర్లలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దాదాపు 20,87,449 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష జరిగిన నెల రోజులలోఏ ప్రాథమిక ఆన్సర్‌ కీని విడుదల చేయడం విశేషం.

ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీలతో పాటు ఓఎంఆర్‌ ఆన్షర్‌ షీట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆన్షర్‌ కీపై అభ్యంతరాలను ఛాలెంజ్‌ చేసేందుకు జూన్‌ 6 రాత్రి 11:50 గంటల వరకు అవకాశం కల్పించింది. ఒక్కో సమాధానంపై అభ్యంతరం లేవనెత్తేందుకు రూ.200లు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఎన్టీఏ పేర్కొంది. ఇక ప్రాథమిక ఆన్సర్‌ కీపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం మరో నెల రోజుల్లో పరీక్ష తుది ఫలితాలను విడుదల చేస్తామని ఎన్టీఏ తెల్పింది. ఫలితాలతోపాటు తుది ఆన్సర్‌ కీని విడుదల చేస్తామని వివరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.