AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీట్‌ విద్యార్థినికి సమయానికి సాయమందించిన పోలీసులు

అది తిరువళ్లూరు జిల్లా కవరపెట్టైలో ఉన్న నీట్‌ పరీక్షా కేంద్రం.. నీట్‌ ఎగ్జామ్‌ కోసం చక్కగా ప్రీపేర్‌ అయిన మోనిక టన్నుల కొద్దీ కాన్ఫిడెన్స్‌తో తల్లి షీలాతో కలిసి ఎగ్జామినేషన్‌ సెంటర్‌కు వచ్చింది.. అంతా బాగానే ఉంది కానీ తన ఒరిజినల్‌ ఐడీ కార్డును..

నీట్‌ విద్యార్థినికి సమయానికి సాయమందించిన పోలీసులు
Balu
| Edited By: |

Updated on: Sep 14, 2020 | 2:52 PM

Share

అది తిరువళ్లూరు జిల్లా కవరపెట్టైలో ఉన్న నీట్‌ పరీక్షా కేంద్రం.. నీట్‌ ఎగ్జామ్‌ కోసం చక్కగా ప్రీపేర్‌ అయిన మోనిక టన్నుల కొద్దీ కాన్ఫిడెన్స్‌తో తల్లి షీలాతో కలిసి ఎగ్జామినేషన్‌ సెంటర్‌కు వచ్చింది.. అంతా బాగానే ఉంది కానీ తన ఒరిజినల్‌ ఐడీ కార్డును వెంటపెట్టుకోవడం మర్చిపోయింది.. ఒరిజనల్‌ ఐడీ కార్డు ఉంటే తప్ప పరీక్ష కేంద్రంలోకి అనుమతించమన్నారు అధికారులు.. అయ్యా ఐడీ కార్డు లేకపోతే ఏమిటి..? హాల్‌టికెట్‌లోని ఫోటోను.. తనను పరికించి చూసి లోపలికి పంపండంటూ బతిమాలింది.. వేడుకుంది.. అధికారులు మాత్రం రూల్స్‌ రూల్సేనన్నారు.. అనుమతించడం కుదరదని గట్టిగా చెప్పారు.. కన్నీళ్లు పెట్టుకుంది మోనిక.. ఆమె కన్నీళ్లు చూసి కూడా అధికారులు కరగలేదు.. అక్కడే ఉన్న తిరువళ్లూరు జిల్లా డీఎస్పీ రమేశ్‌ మాత్రం చలించిపోయారు.. విద్యార్థినీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికక్కడే ఓ నిర్ణయం తీసుకున్నారు.. వెంటనే చెన్నైకు వెళ్లి విద్యార్థినికి సంబంధించిన ఒరిజినల్‌ ఐడీ ప్రూఫ్‌ తీసుకురమ్మంటూ కానిస్టేబుల్‌ మహేశ్వరన్‌ను ఆదేశించారు.. ఎంతకాదనుకున్నా తిరువళ్లూరు నుంచి చెన్నైకు 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది.. అంటే రానూపోనూ 80 కిలోమీటర్లన్నమాట… మహేశ్వరన్‌ విద్యార్థిని తల్లి షీలాను వెనకాతల కూర్చొబెట్టుకుని చెన్నైకు వెళ్లి ఐడీ ప్రూఫ్‌ పట్టుకొచ్చారు. అదీ సమయానికి! పోలీసులు చేసిన సహాయానికి మోనిక చెమ్మగిల్లిన కళ్లతోనే కృతజ్ఞతలు చెప్పుకుంది.. దండం పెట్టి సంతోషంతో ఎగ్జామ్‌ సెంటర్‌లోకి వెళ్లింది.. అక్కడున్న అందరూ పోలీసులను శభాష్‌ అంటూ ప్రశంసించారు.. ఎగ్జామ్‌ అయిన తర్వాత మోనికను, ఆమె తల్లి షీలాను చెన్నైకు భద్రంగా చేరుకునేలా ఏర్పాట్లు చేశారు పోలీసులు.. తమ కుటుంబం పోలీసుకు ఎప్పుటికీ రుణపడి ఉంటుందని మోనిక అదుపు చేసుకోలేని భావోద్వేగంతో చెప్పింది..

Follow Us
బంగ్లాదేశ్‌ టూర్‌కు భారత జట్టు.. ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుందంటే?
బంగ్లాదేశ్‌ టూర్‌కు భారత జట్టు.. ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుందంటే?
రామ్‌ చరణ్‌కు సర్జరీ.. 'అపోలో' ఉండగా.. గంగా హాస్పిటల్ ఎందుకు?
రామ్‌ చరణ్‌కు సర్జరీ.. 'అపోలో' ఉండగా.. గంగా హాస్పిటల్ ఎందుకు?
IND vs SL Test: రీఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. దూరమైన ముగ్గురు..
IND vs SL Test: రీఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. దూరమైన ముగ్గురు..
రాత్రి పడుకునే ముందు ఈ 3 విషయాలను చూడొద్దు.. ప్రశాంతమైన నిద్రకు..
రాత్రి పడుకునే ముందు ఈ 3 విషయాలను చూడొద్దు.. ప్రశాంతమైన నిద్రకు..
సింపుల్ చిట్కా.. వర్షాకాలంలో బట్టలు ఇలా ఆరబెట్టుకోండి..
సింపుల్ చిట్కా.. వర్షాకాలంలో బట్టలు ఇలా ఆరబెట్టుకోండి..
పెద్దల పాదాలకు నమస్కారం ఎందుకు చేస్తారు? చరణస్పర్శ వెనుక ఉన్న..
పెద్దల పాదాలకు నమస్కారం ఎందుకు చేస్తారు? చరణస్పర్శ వెనుక ఉన్న..
వా.. ఏం ఐడియా సర్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ కష్టాలకు చెక్!
వా.. ఏం ఐడియా సర్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ కష్టాలకు చెక్!
పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్..యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట
పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్..యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట
మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..
మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..
మిథున రాశిలోకి కుజుడు.. వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు
మిథున రాశిలోకి కుజుడు.. వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు