Covid-19 vaccine: వ్యాక్సిన్ వృథాపై సమీక్షించుకోండి.. 1 శాతం మించొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు..
Union health Ministry: దేశంలో ఓ వైపు కరోనావైరస్ కేసులు పెరుగుతుంటే.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాది మందికి
Union health Ministry: దేశంలో ఓ వైపు కరోనావైరస్ కేసులు పెరుగుతుంటే.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాది మందికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. రేపటినుంచి 45ఏళ్లు పైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిన వ్యాక్సిన్ డోసుల్లో 1శాతం కన్నా ఎక్కువ వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. వ్యాక్సిన్ వృథాపై నిత్యం సమీక్షించుకోవాలంటూ మరోసారి కేంద్రం కోరింది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం ఆయా రాష్ట్రాల ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఆయన రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. కరోనా వ్యాక్సిన్‌ను ఎక్కువగా లేక తక్కువగా నిల్వలు చేయొద్దని రాష్ట్రాలకు సూచించారు. వ్యాక్సిన్ల కొరత లేదని.. ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లను రాష్ట్రాలకు పంపుతున్నామంటూ రాజేష్ భూషన్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ కవరేజి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆయాప్రాంతాల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.
దేశంలో జనవరి 16నుంచి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముందుగా ఆరోగ్య కార్యకర్తలతోపాటు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించారు. మార్చి 1 నుంచి 60ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించనున్నారు. కాగా.. దేశవ్యాప్తంగా మంగళవారం సాయంత్రం 7 గంటల వరకు మొత్తం 6.24 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.
Also Read: