Covid-19: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కరోనా కలకలం.. 30 మందికి పాజిటివ్‌

Sports Authority of India: దేశంలో కరోనా కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో క్రికెట్ గాడ్ సచిన్ సహా.. మరో నలుగురు మాజీ క్రీడాకారులు కరోనా

Covid-19: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కరోనా కలకలం.. 30 మందికి పాజిటివ్‌
Sports Authority Of India
Follow us

|

Updated on: Apr 01, 2021 | 1:28 AM

Sports Authority of India: దేశంలో కరోనా కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో క్రికెట్ గాడ్ సచిన్ సహా.. మరో నలుగురు మాజీ క్రీడాకారులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కరోనా కలకలం రేపింది. పాటియాల, బెంగళూరు సాయ్‌ కేంద్రాల్లో ఉన్న అథ్లెట్లు, సహాయ సిబ్బంది 30 మందికి కరోనా నిర్థారణ అయింది. ఒలింపిక్స్ 2020 సన్నాహకాల్లో భాగంగా నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. అథ్లెట్లు, సిబ్బందికి పరీక్షలను నిర్వహించింది. పాటియాల, బెంగళూరు కేంద్రాల్లో ఉన్న 741 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. వారిలో 30 మంది క్రీడాకారులు, సిబ్బందికి కరోనా సోకినట్లు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా బుధవారం వెల్లడించింది.

పాటియాలలో 313 మందికి పరీక్షించగా.. 26 మందికి, బెంగళూరులో 428 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి కరోనావైరస్ నిర్థారణ అయినట్లు వెల్లడించింది. పాటియాలలోని 26 మందిలో 16 మంది క్రీడాకారులుండగా.. 10 మంది సహాయ సిబ్బంది ఉన్నారని పేర్కొంది. 16 మంది అథ్లెట్లలో 10 మంది బాక్సర్లు, 6 గురు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు కేంద్రంలో ఉన్న రేస్‌ వాకింగ్‌ కోచ్‌కూ మరో ముగ్గురికి కరోనా నిర్థారణ అయిందని.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లు ఎవ్వరికీ కరోనా సోకలేదని తెలిపింది. ముందస్తు చర్యగా క్రీడాకారులందరినీ ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే ఈ రెండు సెంటర్లలో టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్లు గానీ, కోచ్‌లుగానీ వైరస్‌ బారిన పడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read:

IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్.. మరో గుడ్ న్యూస్..!