6 నెలలుగా వజ్రాల వేట…రూ. 50 లక్షల విలువైన డైమండ్ లభ్యం

ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆరునెలలుగా వజ్రాల వేట కొనసాగిస్తున్నాడు. ఉదయం లేచింది మొదలు..రాత్రి వరకు తన తల్లిదండ్రులతో అక్కడి మట్టిని జల్లెడపడుతూనే గడిపాడు. ఎట్టకేలకు అతడి కష్టం ఫలించింది. రూ. 50 లక్షల విలువైన వజ్రం దొరికింది...

6 నెలలుగా వజ్రాల వేట...రూ. 50 లక్షల విలువైన డైమండ్ లభ్యం
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 22, 2020 | 4:24 PM

ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆరునెలలుగా వజ్రాల వేట కొనసాగిస్తున్నాడు. ఉదయం లేచింది మొదలు..రాత్రి వరకు తన తల్లిదండ్రులతో అక్కడి మట్టిని జల్లెడపడుతూనే గడిపాడు. ఎట్టకేలకు అతడి కష్టం ఫలించింది. రూ. 50 లక్షల విలువైన వజ్రం దొరికింది. దాంతో అతడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

వజ్రాలకు పెట్టింది పేరుగా ఉన్న మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఎక్కువ మంది ప్రజలు వజ్రాల వేటనే వృత్తిగా కొనసాగిస్తుంటారు. గనులను లీజుకు తీసుకుని వజ్రాల కోసం వేట సాగిస్తారు. ఈ క్రమంలోనే ఆనందిలాల్‌ కుష్వాహ అనే వ్యక్తి రాణీపూర్‌ ప్రాంతంలో ఓ మైన్‌ను లీజుకు తీసుకుని నడిపిస్తున్నాడు. కొన్ని రోజుల కిందట అతడి కష్టం ఫలించి అత్యంత విలువైన వజ్రం దొరికింది. సుమారుగా రూ. 50 లక్షల విలువైన 10.69 క్యారెట్ల వజ్రం దొరికింది.

ఆరు నెలలుగా తాను, తన తల్లిదండ్రులు పడుతున్న కష్టానికి ఫలితం దక్కిందని అతడు సంతోషం వ్యక్తం చేశాడు. వజ్రాన్ని స్థానిక డైమండ్ కార్యాలయంలో (హీరా కార్యాలయ్) సమర్పించాడు. త్వరలో దాన్ని వేలం వేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వ ట్యాక్స్‌లు, ఇతర ఖర్చులు పోను అతడికి కనీసం 50 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉందని వజ్రాల వ్యాపారులు అంచనా వేస్తున్నారు.