ఆగస్టు 5 న అయోధ్యలో ప్రధాని మోదీచే భూమిపూజ…ట్రస్ట్ ప్రకటన

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు 5 న ప్రధాని మోదీ భూమిపూజ చేస్తారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో..

ఆగస్టు 5 న అయోధ్యలో ప్రధాని మోదీచే భూమిపూజ...ట్రస్ట్ ప్రకటన
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 22, 2020 | 4:45 PM

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు 5 న ప్రధాని మోదీ భూమిపూజ చేస్తారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటించాలన్న నిబంధన మేరకు 150 మంది ఆహ్వానితులతో బాటు 200 మందిని మించకుండా  ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టు చూడాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. శంకు స్థాపనకు ముందు మోదీ….. ఆలయంలో  రాముడికి, హనుమాన్ గర్హి టెంపుల్ లో హనుమంతుడికి పూజలు చేస్తారని అయన వివరించారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రులందరినీ ఆహ్వానిస్తున్నామని స్వామి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. కేంద్ర మంత్రులు కూడా హాజరు కానున్నారని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో ఆ రోజున మోదీ మూడు.. నాలుగు గంటలు గడిపే సూచనలున్నాయి.