AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

100 మంది బౌద్ధ సన్యాసులకు కరోనా పాజిటివ్, చిన్న రాష్ట్రమైన సిక్కింలో కేసుల పెరుగుదల , అదికారుల ఆందోళన

సిక్కింలో దాదాపు 100 మంది బౌద్ధ సన్యాసులకు కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. దీంతో ఆశ్చర్యపోయిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బుద్దిస్ట్ ఆధ్యాత్మిక కేంద్రం పైనా ప్రత్యేక దృష్టి పెట్టింది.

100 మంది బౌద్ధ సన్యాసులకు కరోనా పాజిటివ్,  చిన్న రాష్ట్రమైన సిక్కింలో కేసుల పెరుగుదల , అదికారుల ఆందోళన
Nearly 100 Monks Test Positive For Corona Virus Positive In Sikkim
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 24, 2021 | 11:29 AM

Share

సిక్కింలో దాదాపు 100 మంది బౌద్ధ సన్యాసులకు కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. దీంతో ఆశ్చర్యపోయిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బుద్దిస్ట్ ఆధ్యాత్మిక కేంద్రం పైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. రూమ్ టెక్ ఆధ్యాత్మిక కేంద్రంలో ధర్మ చక్ర సెంటర్ నిజానికి ప్రపంచ ప్రఖ్యాత హెరిటేజ్ సైట్..గ్యాంగ్ టక్ కి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కేంద్రంలో 37 మంది బౌద్ధ సన్యాసులు మొదట పాజిటివ్ బారిన పడ్డారు. అలాగే రాష్ట్రంలోని గుంజాంగ్ మోనాస్థిరీలో 61 మంది కూడా ఈ వైరస్ పాజిటివ్ కి గురి కావడంతో దీన్ని కంటెంయిన్మెంట్ జోన్ గా ప్రకటించారు. వీరినందరినీ వివిధ ఐసొలేషన్ కేంద్రాలకు తరలించారు. ఈ ఆధ్యాత్మిక కేంద్రంలోనికి ఎవరినీ అనుమతించే ప్రసక్తి లేదని, ఇక్కడి వారిని కలుసుకోవడానికి వచ్చే ప్రతివారినీ ట్రేస్ చేసి టెస్టులు నిర్వహిస్తున్నామని గ్యాంగ్ టక్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రూబిన్ సేవా తెలిపారు. సిక్కింలోనూ మరో వారం పాటు లాక్ డౌన్ ని పొడిగించారు. ఈ స్టేట్ లో తాజాగా 324 కోవిద్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ముగ్గురు రోగులు మరణించగా ఇప్పటివరకు మృతుల సంఖ్య 324 కి పెరిగింది. మొత్తం 13,132 కేసులు ఇక్కడ నమోదైనట్టు అధికారులు తెలిపారు. యాక్టివ్ కేసులు 3 వేలకు పైగా ఉన్నాయన్నారు.

దేశ విదేశాల నుంచి ధర్మ చక్ర ఆధ్యాత్మిక కేంద్రానికి వేలాది బౌద్ధ సన్యాసులు వస్తుంటారు. బహుశా వీరి కారణంగా ఈ కేంద్రంలోని వారికి కరోనా పాజిటివ్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.అత్యంత శాకాహారులు, సాధారణ జీవితం గడిపే వీరికి ఈ వైరస్ సోకడం ఆశ్చర్యకరమని స్వయంగా సిక్కిం ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు

Pattipati Pullarao Wife:మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు భార్యపై కేసు.. జూబ్లిహిల్స్ సొసైటీ భూవివాదం కొత్త మలుపు..!

సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..