AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jitesh Sharma : 6,6,6,6,6,..10 బంతుల్లో 36 పరుగులు.. టీ20 మ్యాచ్‌లో జితేష్ శర్మ విధ్వంసం

Jitesh Sharma : విదర్భ ప్రో టీ20 లీగ్‌లో జితేష్ శర్మ కేవలం 10 బంతుల్లో 36 పరుగులు చేసి 6 బంతుల్లో 5 సిక్సర్లు బాదాడు. చిన్న బౌండరీపై నెటిజన్లు చర్చ చేస్తున్నారు. ఆర్‌సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో వైరల్‌గా మారాడు.

Jitesh Sharma : 6,6,6,6,6,..10 బంతుల్లో 36 పరుగులు.. టీ20 మ్యాచ్‌లో జితేష్ శర్మ విధ్వంసం
Jitesh Sharma
Rakesh
|

Updated on: Jun 09, 2026 | 3:46 PM

Share

Jitesh Sharma :రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో కలిసి వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన జోష్‌లో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ స్థానిక లీగ్‌లో పరుగుల విధ్వంసం సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న విదర్భ ప్రో టీ20 లీగ్‌లో నెకో మాస్టర్ బ్లాస్టర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జితేష్, ఇండియా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మైదానంలోకి అడుగుపెట్టిన కొద్దిసేపట్లోనే సిక్సర్ల వర్షం కురిపించి కేవలం 10 బంతుల్లోనే 36 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఇండియా వారియర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో జితేష్ శర్మ ఎదుర్కొన్న ఆరు వరుస బంతుల్లో ఐదు సిక్సర్లు బాదడం విశేషం. ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి బంతికి దర్శన్ నల్కండే బౌలింగ్‌లో అదిరిపోయే సిక్స్ కొట్టిన జితేష్, ఆ తర్వాత 19వ ఓవర్ వేసిన ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో కేవలం నాలుగు బంతుల వ్యవధిలోనే మూడు భారీ సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత రాహుల్ డోంగర్వార్ వేసిన చివరి ఓవర్ లో మరో సిక్సర్ కొట్టి తన ఐదో సిక్స్‌ను పూర్తి చేశాడు. ఇతని మెరుపు ఇన్నింగ్స్ చూసి స్టేడియంలోని అభిమానులు ఫిదా అయిపోయారు.

జితేష్ శర్మ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారినప్పటికీ, క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం మరో కోణంలో స్పందిస్తున్నారు. ఈ మ్యాచ్ జరిగిన గ్రౌండ్‎లోని బౌండరీ సైజ్ అంతర్జాతీయ ప్రమాణాల కంటే చాలా చిన్నదిగా ఉండటాన్ని నెటిజన్లు గుర్తించారు. దీనిపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక అభిమాని వ్యంగ్యంగా స్పందిస్తూ, “బౌండరీని ఇంకొంచెం చిన్నగా చేయాల్సింది” అంటూ కామెంట్ పెట్టాడు. ఈ చిన్న గ్రౌండ్ వల్లే ఇన్ని సిక్సర్లు సాధ్యమయ్యాయంటూ సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ నడుస్తోంది.

గత ఏడాది నెకో మాస్టర్ బ్లాస్టర్ జట్టును విజేతగా నిలిపిన జితేష్ శర్మ, ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. ఒక ట్రోఫీని గెలవడం కోసం ఛేజ్ చేయడం కంటే, గెలిచిన టైటిల్‌ను కాపాడుకోవడం మానసికంగా చాలా ఒత్తిడితో కూడుకున్న వ్యవహారమని చెప్పాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగినప్పుడు ఎక్కడ ఓడిపోతామో అనే అనవసరమైన భయం మనసులో ఉంటుందని, అదే ఒక లక్ష్యం వైపు ప్రయాణించేటప్పుడు తదుపరి వ్యూహాన్ని ఎలా ప్లాన్ చేయాలనే సానుకూల ఆలోచనలు ఉంటాయని జితేష్ వివరించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us