AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Osmania University: కాలేజీని వీడినా, బంధాన్ని వీడలేదు.. ఓయూకు పూర్వ విద్యార్థి భారీ విరాళం

కన్న తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు ఉన్న ఈ రోజుల్లో.. చదువు నేర్పిన అమ్మలాంటి విశ్వవిద్యాలయానికి ఆపన్నహస్తం అందిస్తూ ఓ మాజీ విద్యార్థి తన ఉదారతను చాటుకున్నారు. అమెరికాలో స్థిరపడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి తెల్ల గోపాలరావు.. తన 'టెల్లా సకమోటో ఫౌండేషన్' ద్వారా ఓయూకు రూ.95లక్షలు విరాళం అందించారు.

Osmania University: కాలేజీని వీడినా, బంధాన్ని వీడలేదు.. ఓయూకు పూర్వ విద్యార్థి భారీ విరాళం
Osmania University Donation
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jun 09, 2026 | 3:28 PM

Share

విద్యాభ్యాసం అందించిన విశ్వవిద్యాలయానికి కృతజ్ఞతగా ఓ మాజీ విద్యార్థి చేసిన విరాళం ఉస్మానియా విశ్వవిద్యాలయంకు కొత్త ఊపునిచ్చింది. అమెరికాలో స్థిరపడిన ఓయూ పూర్వ విద్యార్థి తెల్ల గోపాలరావు తన టెల్లా సకమోటో ఫౌండేషన్ ద్వారా 1.10 లక్షల అమెరికన్ డాలర్లు అంటే సుమారు రూ.95 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ విరాళంలో 1 లక్ష డాలర్లు అంటే దాదాపు రూ.85 లక్షలు ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలోని మైనింగ్ ఇంజినీరింగ్ విభాగానికి కేటాయించారు. మిగిలిన 10 వేల డాలర్లు సుమారు రూ.8.5 లక్షలు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి అందజేశారు.

మైనింగ్ ఇంజినీరింగ్ విభాగానికి అందిన నిధులను డిజిటల్ మైనింగ్ సాంకేతికతలు, గనుల పరిశోధన, భద్రతా ప్రమాణాల మెరుగుదల, ఖనిజాల వెలికితీత పద్ధతులు, AI, మెషిన్ లెర్నింగ్ ఆధారిత పరిశోధనల అభివృద్ధికి వినియోగించనున్నారు. ఈ నిధులతో విభాగంలో ఆధునిక సదుపాయాలు ఏర్పడి, పరిశోధనలకు మరింత ప్రోత్సాహం లభించనుంది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి కేటాయించిన 10 వేల డాలర్లను నిర్మాణ సంబంధిత పనులు, మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించనున్నారు.

ఎవరీ తెల్ల గోపాలరావు

తెల్ల గోపాలరావు 1960లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలోని మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో పట్టభద్రులయ్యారు. విశ్వవిద్యాలయంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ విరాళాన్ని అందించినట్లు అధికారులు తెలిపారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పూర్వ విద్యార్థుల సంఘం ద్వారా ఈ విరాళం అందింది. సోమవారం ఓయూ వైస్ ఛాన్సలర్ మొలుగరం కుమార్ ఈ నిధుల కేటాయింపు పత్రాలను తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు అధికారికంగా అందజేశారు.

పూర్వ విద్యార్థులు తమ ఆల్మా మేటర్ అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమని, ఈ విరాళం ద్వారా ఓయూలో పరిశోధన, సాంకేతిక అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని విశ్వవిద్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కాలేజీని వీడినా, బంధాన్ని వీడలేదు.. ఓయూకు పూర్వ విద్యార్థి విరాళం
కాలేజీని వీడినా, బంధాన్ని వీడలేదు.. ఓయూకు పూర్వ విద్యార్థి విరాళం
'నా మృతదేహం పక్కన తారక్‌తో సహా ఆ హీరోలందరూ'.. జగ్గూభాయ్ కామెంట్స్
'నా మృతదేహం పక్కన తారక్‌తో సహా ఆ హీరోలందరూ'.. జగ్గూభాయ్ కామెంట్స్
మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత.. కాసేపటికే దారుణం!
మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత.. కాసేపటికే దారుణం!
తొలకరి తాకిడికి తడిసిన నేల..ఆరుద్రల పరుగులతో మురిసిన పొలం!
తొలకరి తాకిడికి తడిసిన నేల..ఆరుద్రల పరుగులతో మురిసిన పొలం!
ఇంట్లో ఈవీ ఛార్జర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
ఇంట్లో ఈవీ ఛార్జర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టు పై పగబట్టిన పాములు
స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టు పై పగబట్టిన పాములు
వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది
వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది
ప్యాంట్ జేబులో ఉండగా ఒక్కసారిగా పేలిపోయిన ఫోన్.. ఇదిగో వీడియో
ప్యాంట్ జేబులో ఉండగా ఒక్కసారిగా పేలిపోయిన ఫోన్.. ఇదిగో వీడియో
పాపం! జాన్వీని తిట్టొద్దు..ఆమె దర్శకుడు చెప్పిందే చేసింది
పాపం! జాన్వీని తిట్టొద్దు..ఆమె దర్శకుడు చెప్పిందే చేసింది
'పరభాషా నటులతో పోల్చితే అనుకున్నంత గుర్తింపు రావడం లేదు
'పరభాషా నటులతో పోల్చితే అనుకున్నంత గుర్తింపు రావడం లేదు