నిమ్మరసంలో దీన్ని అస్సలు కలపకండి.. అమృతం కాస్త విషంగా మారుతుంది..
Krishna
09 June 2026
నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడటంతో పాటు శరీరంలోని ఎలక్ట్రోలైట్లు తగ్గిపోకుండా బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే ఆరోగ్య పరంగా ఈ పానీయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
డీహైడ్రేషన్
కొంతమంది నిమ్మరసం నీటిని మరింత రుచికరంగా మార్చుకోవడానికి అందులో నల్ల ఉప్పు కలుపుకుంటారు. మరికొందరు జీలకర్ర పొడిని కూడా మిక్స్ చేస్తుంటారు. నిమ్మరసంలో వీటిని కలపడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది.
రుచి కోసం
చాలా మంది నిమ్మరసాన్ని తీపిగా మార్చడానికి అందులో చక్కెరను కలుపుతుంటారు. అయితే నిమ్మరసంలో చక్కెర కలపడం అనేది చాలా ప్రమాదకరమైన పొరపాటని నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల పోషకాలు నశిస్తాయి.
చక్కెర
నిమ్మరసంలో చక్కెరను కలిపి క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని అస్తవ్యస్తం చేస్తుంది. ఫలితంగా డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది.
షుగర్ లెవెల్స్
నిమ్మకాయలో సహజంగానే సిట్రిక్ యాసిడ్, చక్కెరను కలిపినప్పుడు ఆ కాంబినేషన్ వల్ల పళ్లపై ఉండే రక్షణ పొర దెబ్బతింటుంది. ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల కొందరిలో ఎసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి.
అసిడిటీ-పళ్ల సమస్య
చాలా మంది ఉదయాన్నే బరువు తగ్గడం కోసం నిమ్మరసం తాగుతుంటారు. కానీ అందులో చక్కెర వేసుకుని తాగితే.. క్యాలరీల వల్ల బరువు తగ్గడానికి బదులు పొట్ట చుట్టూ కొవ్వు చేరి మరింత బరువు పెరిగే ప్రమాదం ఉంది.
బరువు తగ్గడం
నిమ్మరసంలో ఉండే విటమిన్ సి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. కానీ చక్కెర కలిపితే.. ఆ అదనపు ఫ్రక్టోజ్‌ను ప్రాసెస్ చేయడానికి లివర్, కిడ్నీలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది.
లివర్ - కిడ్నీలు
నిమ్మరసాన్ని తీపిగా తాగాలనుకునే వారు చక్కెరకు బదులుగా ఒక స్పూన్ సహజమైన తేనె లేదా బెల్లం పొడి లేదా రాక్ సాల్ట్ కలుపుకుని తాగడం వల్ల నిమ్మరసంలోని పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయి.