వరుసగా ఫ్లాప్స్..  ఆ దర్శకుడిపైనే కృతి శెట్టి ఆశలన్నీ

09 June 2026

Pic credit - Instagram

Rajeev 

అందాల భామ కృతిశెట్టి.. తొలి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా మారింది. 

 2021లో వచ్చిన ఉప్పెన సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కృతిశెట్టి క్రేజ్ పెంచేసింది. దాంతో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది కృతి. 

రెండో సినిమా నాని హీరోగా నటించిన "శ్యామ్‌ సింగరాయ్‌"‌ లో, మూడవ సినిమా నాగచైతన్య హీరోగా నటించిన 'బంగార్రాజు' లో నటించింది.

కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన తొలి మూడు చిత్రాలూ వరుసగా విజయం సాధించడంతో ఆమె హ్యాట్రిక్‌ హీరోయిన్‌గా తెలుగుసిని రంగంలో రికార్డు క్రియేట్‌ చేసింది.

కానీ ఆతర్వాత సీన్ రివర్స్ అయ్యింది. ఆతర్వాత కృతిశెట్టి నటించిన 7 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో సినిమాల స్పీడ్ తగ్గించింది.

వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో నటించింది కృతి.. కానీ అన్ని ఫ్లాప్ అవ్వడంతో.. మలయాళం, తమిళ్ సినిమాల పై ఫోకస్ పెట్టింది. 

ఇటీవలే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తుంది.