Navjot Singh Sidhu: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా.. పార్టీ అధినేత్రి అభీష్టం మేరకు..

పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశం మేరకు ఆయన తన రాజీనామాను సమర్పించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో..

Navjot Singh Sidhu: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా.. పార్టీ అధినేత్రి అభీష్టం మేరకు..
Navjot Singh Sidhu (File Photo)
Follow us
Janardhan Veluru

|

Updated on: Mar 16, 2022 | 10:48 AM

Punjab Congress:  పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ(Sidhu) రాజీనామా చేశారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi) ఆదేశాల మేరకు ఆయన తన రాజీనామాను ఆమెకు సమర్పించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడం తెలిసిందే. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడి అధికారం కోల్పోయింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ కేవలం 18 స్థానాలకు పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాల్లో గెలిచి ఆ రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) గత ఆదివారంనాడు సమావేశమై చర్చించింది. పార్టీ పదవుల నుంచి తప్పుకునేందుకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సుముఖత వ్యక్తంచేసినా.. సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా వారి ప్రతిపాదనను తిరస్కరించింది. పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.

కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ పీసీసీ చీఫ్‌లు తమ పదవులకు రాజీనామా చేయాలని సోనియాగాంధీ మంగళవారం ఆదేశించారు. ఆ మేరకు తన పదవికి పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధూ రాజీనామా సమర్పించారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అభీష్టం మేరకు తన రాజీనామాను పంపుతున్నట్లు తెలిపారు.

నవజ్యోత్ సింగ్ సిద్ధూ ట్వీట్..

Also Read..

VAMNICOM Jobs 2022: వైకుంఠ మెహతా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కో ఆపరేటివ్‌ మేనేజ్‌మెంట్‌ ఫ్యాకల్టీ ఉద్యోగాలు..

Viral Video: ముందు సై అంది.. ఆ తర్వాత కెవ్వుమంది.. కుక్కపిల్లకు చుక్కలు చూపించిన బాతు.. వీడియో చూస్తే షాకే..