Punjab: పంజాబ్ లో రాష్ట్రపతి పాలనకు కుట్ర చేస్తున్నారు.. జైలు నుంచి వచ్చిన నవ్ జ్యోత్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు

Aravind B

Aravind B |

Updated on: Apr 01, 2023 | 7:34 PM

1988లో జరిగిన ఓ గొడవ కేసులో గత ఏడాది జైలుకెళ్లిన మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ సుమారు పదినెలల తర్వాత పంజాబ్ లోని పాటియాల జైలు నుంచి విడుదలయ్యారు.

Punjab: పంజాబ్ లో రాష్ట్రపతి పాలనకు కుట్ర చేస్తున్నారు.. జైలు నుంచి వచ్చిన నవ్ జ్యోత్  సిద్ధూ సంచలన వ్యాఖ్యలు
Navjot Sidhu
Follow us

1988లో జరిగిన ఓ గొడవ కేసులో గత ఏడాది జైలుకెళ్లిన మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ సుమారు పదినెలల తర్వాత పంజాబ్ లోని పాటియాల జైలు నుంచి విడుదలయ్యారు. అయితే సిద్ధూ బయటకు రావడంతోనే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యమే లేదని ఆరోపించారు. పంజాబ్ లో రాష్ట్రపతి పాలన తెచ్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పంజాబ్ బలహీనం చేయాలని చూస్తే మీరే బలహీనమైపోతారంటూ హెచ్చరించారు. తాను ఈ రోజు మధ్యాహ్నమే విడుదల కావాల్సి ఉండగా.. అధికారులు ఆలస్యం చేశారన్నారు. వారు మీడియా వాళ్లని వెళ్లిపోవాలని కోరుకున్నట్లు తెలిపారు. దేశానికి నియంతృత్వ పాలన వచ్చినప్పుడు విప్లవం కూడా వస్తుందని వ్యాఖ్యానించారు. ఆ విప్లవం పేరే రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేయలడని తెలిపారు.

అయితే 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ గొడవకు సంబంధించిన కేసులో సిద్ధూకు ఏడాది పాటు జైలు శిక్ష పడింది. 1988 డిసెంబరు 27న పటియాలాలో పార్కింగ్‌ విషయంలో 65 ఏళ్ల గుర్నామ్ అనే వ్యక్తితో సిద్ధూకి ఘర్షణ జరిగింది. ఈ దాడిలో గుర్నామ్ సింగ్ తీవ్రంగా గాయపడి చనిపోయాడు. ఈ కేసులో సిద్ధూతో పాటు రూపిందర్ సింగ్ పై దాడి చేశారనే అభియోగాలు కూడా నమోదయ్యాయి. ఈ కేసుపై పలు కోర్టుల్లో విచారణ ముగిసిన అనంతరం.. 2022 మే లో సుప్రీంకోర్టు సిద్ధూకి ఏడాది వరకు జైలు శిక్ష విధించింది. అనంతరం సిద్ధూని పటియాలా సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే అతను 10 నెలల తర్వాత ఇప్పుడు జైలు నుంచి విడుదలయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu