Presidential Elections 2022: భారత రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ.. చివరి తేదీ ఎప్పుడంటే..
Gazette Notification: గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జూన్ 30 నామినేషన్లను పరిశీలించనున్నారు. జులై 2 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ.
భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జూన్ 30 నామినేషన్లను పరిశీలించనున్నారు. జులై 2 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఇక రాష్ట్రపతి ఎన్నికకు జులై 18న పోలింగ్ నిర్వహించి, 21న ఫలితాలను విడుదల చేయనున్నారు. కొత్త రాష్ట్రపతి జులై 25న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24న ముగియనుంది. పార్లమెంటులో, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో పోలింగ్ జరుగుతుంది. ఎలక్టోరల్ కాలేజ్ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఎలక్టోరల్ కాలేజీలో 4,896 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు. వీళ్లదరికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కు ఉంటుంది.
జులై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జులై 21న రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు జులై 25వ తేదీన కొత్త రాష్ట్రపతి ప్రమాణస్వీకారం ఈనెల 15న రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్
రాష్ట్రపతి ఎన్నికలో అధికార, విపక్షాల ప్రయత్నాలు..
6వ రాష్ట్రపతి ఎన్నిక భారతదేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం సృష్టించబోతోంది. ఉమ్మడి శత్రువు బీజేపీ అని విపక్షాలన్నీ అంటున్నా వాటి మధ్య మాత్రం సఖ్యత కుదరడం లేదు. బీజేపీని రాజకీయంగా దెబ్బకొట్టడానికి రాష్ట్రపతి ఎన్నికలు గొప్ప అవకాశంగా భావిస్తున్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. దేశాన్ని విభజిస్తున్న బీజేపీకి వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకం కావాలని మమత పిలుపునిచ్చారు. మొత్తం 22 రాజకీయ పార్టీలకు లేఖలు రాసిన మమత రాష్ట్రపతి ఎన్నికలో తనదైన రాజకీయ వ్యూహం అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
22 పార్టీలను ఆహ్వానించిన మమతా బెనర్జీ.. సమావేశానికి హాజరైన 14 పార్టీల నేతలు
కాంగ్రెస్
ఎన్పీపీ
జేడీఎస్
డీఎంకే
నేషనల్ కాన్ఫరెన్స్
పీడీపీ
ఆర్జేడీ
శివసేన
సీపీఐ
సీపీఎం
ఆర్‌ఎల్జీ
డీఎంకే
జేడీఎస్
సమావేశానికి హాజరుకాని పార్టీలు
టీఆర్‌ఎస్
ఆప్
బీఎస్పీ
బీజేడీ
బీఎస్పీ
అకాలీదళ్
మమత ఆహ్వానం లేని విపక్ష పార్టీలు
టీడీపీ
వైసీపీ
మజ్లిస్
మరోవైపు బీజేపీ మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తోంది.విపక్షాలతో టచ్ లోకి వచ్చారు రాజ్‌నాథ్‌సింగ్. కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గేతో రాజ్‌నాథ్ మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు ఉమ్మడి అభ్యర్ధిని ప్రకటించాలన్న మమత లక్ష్యం నెరవేరేలా కన్పించడం లేవదు.