AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCW: కల్నల్ సోఫియా ఖురేషిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మహిళా కమిషన్!

భారత సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ (NCW) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతగల పదవుల్లో ఉండి దేశానికి రక్షణ కల్పిస్తున్న మహిళా అధికారుల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేసింది. సాయుధ బలగాల్లో పనిచేసే అధికారుల పట్ల ప్రతి ఒక్కరు గౌరవప్రదంగా వ్యవహరించాలని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది.

NCW: కల్నల్ సోఫియా ఖురేషిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మహిళా కమిషన్!
Colonel Sofiya Qureshi
Anand T
|

Updated on: May 14, 2025 | 5:20 PM

Share

భారత్‌-పాకిస్తాన్ ఉద్రిక్తల నేపథ్యంలో భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ గురించి మీడియాకు వివరాలు వెల్లడించిన సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి విజయ్‌ షా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ మాట్లాడిన ఆయన ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారని.. వాళ్ల మతానికి చెందిన సోదరిని ప్రధాని మోదీ సైనిక విమానంలో పాక్‌కు పంపించి పాఠం నేర్పించారని అన్నారు. అయితే కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విజయ్‌ షా వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటుగా, కించపరిచే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతగల పదవుల్లో ఉండి దేశానికి రక్షణ కల్పిస్తున్న మహిళా అధికారుల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేసింది. సాయుధ బలగాల్లో పనిచేసే అధికారుల పట్ల ప్రతి ఒక్కరు గౌరవప్రదంగా వ్యవహరించాలని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది.

ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యలపై కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ విజయ రహాట్కర్‌ స్పందిస్తూ కొందరు వ్యక్తులు బాధ్యతాయుత పదవుల్లో ఉండి స్త్రీల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ఈ వ్యాఖ్యలు మన మహిళల గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న మన కుమార్తెలను అవమానించినట్లు అవుతుంది ఆయన పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..