National Anti Doping Bill: డోపింగ్‌ నిరోధక బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. క్రీడాకారులకు మరింత ఉపయోగం..!

National Anti Doping Bill: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ ఉభయ సభల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ..

National Anti Doping Bill: డోపింగ్‌ నిరోధక బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. క్రీడాకారులకు మరింత ఉపయోగం..!
Follow us
Subhash Goud

|

Updated on: Aug 03, 2022 | 10:56 PM

National Anti Doping Bill: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ ఉభయ సభల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, నేషనల్ డోపింగ్ టెస్టింగ్ లాబొరేటరీ పనితీరును చట్టబద్ధం చేసే జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు 2021ను బుధవారం రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఈ బిల్లు గత బుధవారమే లోక్‌సభ ఆమోదించింది. డోపింగ్ నిరోధక అంశంపై ఐక్యరాజ్యసమితి ఒప్పందం కూడా ప్రభావితం చేస్తుంది. లోక్‌సభలో బిల్లుపై జరిగిన చర్చపై కేంద్ర యువజన, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు క్రీడలకు దోహదపడుతుందని, క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని ఆయన అన్నారు.

జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు, 2022 ఈరోజు రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించబడింది. క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిగా అనురాగ్ ఠాకూర్ ప్రవేశపెట్టిన మొదటి బిల్లు ఇదే. ఏదైనా అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించడానికి అవసరమైన పరీక్షల సంఖ్య నెలకు 10,000 వరకు ఉంటుందని, ప్రస్తుతం భారతదేశంలో సంవత్సరానికి 6వేల పరీక్షలను మాత్రమే నిర్వహిస్తోందని అన్నారు. ప్రతిపాదిత చట్టం పరీక్ష సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంలో సహాయపడుతుందని మంత్రి పేర్కొన్నారు.

16 దేశాల నమూనాలను భారతదేశంలోని ప్రయోగశాలలలో పరీక్షిస్తున్నట్లు ఠాకూర్ సభకు తెలిపారు. ఈ బిల్లు ఆమోదంతో క్రీడల్లో డోపింగ్‌పై విచారణకు సంబంధించి సొంత చట్టాలను కలిగి ఉన్న అమెరికా, చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి ఎంపిక చేసిన దేశాల క్లబ్‌లో భారత్ చేరుతుందని మంత్రి వెల్లడించారు.

ఏ ల్యాబొరేటరీ ఏర్పాటుకు 70 నుంచి 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని, అయితే ఇందుకు ఎలాంటి లోటు ఉండదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ క్రీడలకు, క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తారని, ఈ చట్టం అమల్లోకి రావడంతో మన ఆటగాళ్లకు ఎంతో మేలు జరగడంతో పాటు విదేశాలకు ఆటగాళ్ల టెస్ట్ శాంపిల్స్ పంపడంపై ఆధారపడే పరిస్థితి పూర్తిగా తొలగిపోతుందన్నారు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే