Viral: అరెరె పెద్ద సమస్యే వచ్చిపడిందే.. ఈ ప్రభుత్వ ఉద్యోగి లీవ్ లెటర్ చూస్తే మీరు స్టన్ అవుతారు

బాబ్బాబు సెలవు ఇవ్వండి. పుట్టింటికి వెళ్లిన భార్యను బ్రతిమాలి తిరిగి వెనక్కి తెచ్చుకోవాలంటూ ఓ గవర్నమెంట్ ఎంప్లాయ్ రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Viral: అరెరె పెద్ద సమస్యే వచ్చిపడిందే.. ఈ ప్రభుత్వ ఉద్యోగి లీవ్ లెటర్ చూస్తే మీరు స్టన్ అవుతారు
Leave Letter
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 03, 2022 | 10:40 PM

Trending: సోషల్ మీడియా(Social media) వినియోగం పెరిగాక.. నెట్టింట రకరకాల ఫన్నీ లీవ్ లెటర్స్, స్టూడెంట్స్ ఎగ్జామ్ ఆన్సర్ షీట్స్ వైరల్ అవుతున్నాయి. అవి నవ్వు తెపిస్తున్నాయి.  దీంతో అలాంటి వాటిని ఫ్రెండ్స్‌కు షేర్ చేస్తూ ఎంజాయ్  చేస్తున్నారు నెటిజన్స్. అలాంటి కోవకే చెందిన ఓ లెటర్ ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తుంది. తనపై కోపంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని.. ఆమెను బ్రతిమాలి..బుజ్జగించి ఇంటికి తెచ్చుకోవాలంటూ ఓ గవర్నమెంట్ ఎంప్లాయి బాస్‌కు లీవ్ లెటర్ పెట్టారు. ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పుర్​లో ఈ క్రేజీ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే షమ్షాద్ అహ్మద్ అనే వ్యక్తి యూపీలోని BSAలో (Basic Shiksha Adhikari)లో ఎంప్లాయిగా వర్క్ చేస్తున్నాడు. ప్రజంట్ కాన్పుర్​లోని ప్రేమ్​ నగర్​ బ్రాంచ్‌లో క్లర్క్​గా డ్యూటీ చేస్తున్నాడు. లీవ్ కావాలంటే ఉన్నతాధికారికి లేఖ రాశాడు అహ్మద్​. “ప్రేమగా చూసుకునే విషయంలో మా ఆవిడకు, నాకు చిన్న వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లింది. పిల్లల్ని కూడా తీసుకుని వెళ్లిపోయింది. దీంతో నా మెంటల్ సిట్యూవేషన్ సరిగా లేదు. ఆమెను బ్రతిమాలి తిరిగి ఇక్కడికి తీసుకురావాలి. అందుకోసం ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు ఎమర్జెన్సీ లీవ్ కావాలి” అని లీవ్ లెటర్‌లో రాసుకొచ్చాడు అహ్మద్.

దీంతో ఈ వెరైటీ లీవ్ లెటర్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. రకరకాల కామెంట్స్ పెడుతూ ఈ లేఖను వైరల్ చేస్తున్నారు.’ ఇది చాలా పెద్ద సమస్య’ అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘లీవ్ ఇవ్వకపోయినా.. వెళ్లాల్సిన సిట్యువేషన్ ఇది’ అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. కాగా ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చినట్లు జిల్లా బీఎస్​ఏ ఆఫీసర్ సుర్జీత్ సింగ్ వెల్లడించారు. స్థానిక అధికారులను దీనిపై వివరణ అడిగినట్లు చెప్పారు.

Vral Leave Letter

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి