Traffic Signal: రోడ్డుపై ఇలాంటి సైన్‌ బోర్డ్‌ను ఎప్పుడైనా గమనించారా.. దీని అర్థమేంటో తెలుసా.?

Traffic Signal: రోడ్లపై నియంత్రణ లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు వెళ్లకుండా ఒక పద్ధతి ప్రకారం వెళ్లడానికే ట్రాఫిక్‌ రూల్స్‌ను తీసుకొచ్చారు. ప్రమాదాలు జరగకుండా వాహనదారులను అప్రమత్తం చేయడానికి రోడ్లపై...

Traffic Signal: రోడ్డుపై ఇలాంటి సైన్‌ బోర్డ్‌ను ఎప్పుడైనా గమనించారా.. దీని అర్థమేంటో తెలుసా.?
Follow us
Narender Vaitla

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 06, 2022 | 8:18 AM

Traffic Signal: రోడ్లపై నియంత్రణ లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు వెళ్లకుండా ఒక పద్ధతి ప్రకారం వెళ్లడానికే ట్రాఫిక్‌ రూల్స్‌ను తీసుకొచ్చారు. ప్రమాదాలు జరగకుండా వాహనదారులను అప్రమత్తం చేయడానికి రోడ్లపై సైన్‌ బోర్డ్‌లను ఏర్పాటు చేస్తుంటారు. వీటిని గమనించి యూటూర్న్‌ తీసుకోవాలా వద్దా.. ఓవర్‌ టేక్‌ చేయాలా వద్దా.. లాంటి అంశాలను అంచనా వేసుకొని ముందుకు వెళుతుంటారు. ఇలా మనకు రోడ్డుపై వెళుతున్నప్పుడు రకరకాల సైన్‌ బోర్డ్స్‌ కనిపిస్తుంటాయి. అయితే తాజాగా బెంగళూరులో కనిపించిన ఓ సైన్‌ బోర్డ్‌ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

సైన్‌ బోర్డ్‌పై ఎలాంటి లైన్స్‌ లేకుండా కేవలం నాలుగు బ్లాక్‌ పాయింట్స్‌ ఉన్న సైన్‌ బోర్డ్‌ను గమనించిన ఓ వ్యక్తి ఆ బోర్డును ఫొటో తీసి ట్వీట్ చేశాడు. బెంగళూరులోని హోప్‌ఫామ్‌ అనే ప్రాంతానికి సమీపంలో ఉన్న సైన్‌ బోర్డ్‌ అర్థం ఏంటి.? అని పేర్కొంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ బోర్డ్‌కు అర్థం ఏంటో తెలియక చాలా మంది తల బద్దలు కొట్టు్కున్నారు. అయినా ఎవరికీ సమాధానం లభించలేదు. దీంతో ఈ పోస్ట్‌కు వైట్‌ఫీల్డ్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ వెంటనే బదులిచ్చింది.

సదరు సైన్‌ బోర్డ్‌ అర్థమేంటో తెలుపుతూ ట్వీట్‌ చేసింది. ఆ నాలుగు చుక్కల సైన్‌ బోర్డ్‌ అర్థాన్ని వివరిస్తూ.. ‘అంధులు నడిచే అవకాశాలు ఉంటుందని, వాహనదారులను అప్రమత్తం చేయడానికి ఈ సైన్‌ బోర్డులను ఏర్పాటు చేస్తారు. బెంగళూరులోని హోప్‌ఫామ్‌ జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన ఈ సైన్‌ బోర్డ్‌కు సమీపంలో ఒక అంధుల పాఠశాల ఉంది’ అని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పుడు అర్థమైంది కదా.. ఈ బోర్డ్‌ అర్థమేంటో.. సో ఇప్పటి నుంచి ఎక్కడైనా ఇలాంటి బోర్డ్‌లు కనిపిస్తే వాహనం వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా చూస్తూ వెళ్లండి.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..