హనుమంతుడి ఆలయ నిర్మాణానికి ముస్లిం కుటుంబం తమ భూమిని విరాళంగా ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా తిల్హార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కచియంఖేడాలో ఇప్పుడు హనుమంతుడి ఆలయం నిర్మాణం చేపట్టనున్నారు. కేంద్ర హోం శాఖ మాజీ సహాయ మంత్రి స్వామి చిన్మయానంద జిల్లా పరిపాలనా అధికారుల సంయుక్త కృషితో, బాబు అలీ తన భూమిని ఆలయ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారు. ఇక్కడ సుమారు 140 సంవత్సరాల నాటి హనుమంతుడికి ఆలయం నిర్మించనున్నారు. ఇందుకు అవసరమైన పత్రాలను తిల్హార్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తన భూమిని దానంగా ఇస్తున్నట్లు బాబు అలీ రిజిస్టర్ ప్రక్రియను పూర్తి చేశారు.
రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ పత్రాలను బాబు అలీ, స్వామి చిన్మయానంద, SDMతో కలిసి హనుమంతుని పాదాల వద్ద సమర్పించారు. షాజహాన్‌పూర్‌లోని జాతీయ రహదారి 24 విస్తరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తిల్హార్‌లోని కచియంఖేడాలో స్థాపించబడిన సుమారు 140 సంవత్సరాల పురాతన హనుమంతుడి విగ్రహానికి ఆలయాన్ని నిర్మించే ప్రక్రియ జరుగుతోంది.
హనుమాన్ దేవాలయం కోసం భూమిని విరాళం:
ఈ సందర్భంలో ఆలయానికి స్థల సేకరణ కోసం ఎస్‌డిఎం రాశికృష్ణ, తహసీల్దార్ జ్ఞానేంద్రనాథ్‌లు ఆలయం వెనుక ఉన్న పొలం యజమాని స్వామి బాబు అలీతో నిత్యం సంప్రదింపులు జరిపారు. అయితే అధికారులు బాబు అలీతో మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత స్వామి చిన్మయానంద సరస్వతి పొలం యజమాని బాబు అలీతో మాట్లాడి.. ఆలయ నిర్మాణం కోసం భూమి ఇవ్వాలని కోరారు. దీంతో బాబు అలీ తన కుటుంబ సభ్యులతో మాట్లాడి భూమిని ఇచ్చేందుకు అంగీకరించారు.
స్వామివారి పేరిట భూమిని రిజిస్ట్రేషన్ చేయించిన తరువాత.. బాబు అలీ ఆ దస్తావేజులతో అధికారులతో హనుమంతుడి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ హనుమంతుడి పాదాల వద్ద స్వామి చిన్మయానంద సరస్వతితో కలిసి దస్తావేజు కాపీని సమర్పించాడు.
బాబు అలీ ఐదుగురు కుమారులతో నివసిస్తున్నాడు
బాబు అలీ తన ఐదుగురు కుమారులతో కలిసి టిల్హార్ పట్టణంలోని మొహల్లా హిందూ బెల్ట్‌లో నివసిస్తున్నాడు. వారికి జాతీయ రహదారి పక్కన దాదాపు 30 బిగాల భూమి ఉంది. అందులో 7 బిఘాల భూమిని జాతీయ రహదారి విస్తరణ కారణంగా పరిపాలన విభాగం స్వాధీనం చేసుకుంది, ఈ సమయంలో జిల్లా యంత్రాంగం జాతీయ రహదారి మధ్యలోకి వస్తున్న హనుమంతుడి ఆలయాన్ని తరలించే పనిని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హిందూ-ముస్లిం ఐక్యతకు ఉదాహరణగా, బాబు అలీ తన 1 బిగా భూమిని హనుమంతుడి కోసం విరాళంగా ఇచ్చాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..