AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మత సామరస్యం అంటే ఇదే.. హిందూ దేవాలయంలో ముస్లిం జంట నిఖా.. దగ్గరుండి జరిపించిన వీహెచ్‌పీ-ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు..

విశ్వాసాలు వేరు కావచ్చు.. కానీ అందరూ ఒక్కటే. ఇదే విషయాన్ని సమ సమాజానికి చాటి చెప్పేలా ఓ ముస్లీం జంట తమ వివాహాన్ని హిందూ సంఘాల ప్రతినిధులు హిందూ

మత సామరస్యం అంటే ఇదే.. హిందూ దేవాలయంలో ముస్లిం జంట నిఖా.. దగ్గరుండి జరిపించిన వీహెచ్‌పీ-ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు..
Muslim Marriage In Hindu Temple
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 07, 2023 | 7:00 AM

Share

హిందూ-ముస్లిం అనగానే చాలా మంది ఏవేవో అలోచనలు వస్తాయి. కానీ ముందుగా అందరూ గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే.. వారి విశ్వాసాలు వేరు కావచ్చు. కానీ అందరూ ఒక్కటే. ఇదే విషయాన్ని సమ సమాజానికి చాటి చెప్పేలా ఓ ముస్లీం జంట తమ వివాహాన్ని హిందూ సంఘాల ప్రతినిధులు హిందూ దేవాలయంలో దగ్గరుండి మరీ జరిపించారు. అంతేకాక ఆ వివాహానికి పెద్దలు కూడా హిందువులే కావడం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లా రాంపూర్ గ్రామంలో సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది. ఈ గుడి ప్రాంణంలోనే విశ్వహిందూ పరిషత్( వీహెచ్‌పీ), రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యాలయాలు కూడా నడుస్తున్నాయి. గ్రామంలోని ఓ ముస్లిం కుటుంబంలో వివాహం నిశ్చయమైంది. దీన్ని గమనించిన వీహెచ్ పీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు.. సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో పెళ్లి వేడుక చేయాలని ఆ ముస్లీం కుటుంబాన్ని కోరారు. వారు కూడా అందుకు అంగీకరించడంతో ఈ వివాహా వేడుకకు హిందువులు, ముస్లింలు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు.

వారే కాక మౌల్వీ, సాక్షులు, లాయర్ సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ప్రజల మధ్య సోదరభావాన్ని పెంచేందుకు, మత సామరస్య సందేశాన్ని చాటేందుకు దేవాలయంలో నిఖా జరిపించినట్టు హిందూ సంఘాల ప్రతినిధులు తెలిపారు. సనాతన హిందూ ధర్మ అందరినీ కలుపుకుని వెళ్లాలని స్పష్టం చేస్తుందని, మనుషులంతా ఒక్కటే అని చాటి చెబుతుందని, అందుకే ముస్లిం జంట పెళ్లిని.. సత్యనారాయణ స్వామి ఆలయంలో ముస్లీం మత ఆచారం ప్రకారం నిర్వహించటానికి అనుమతించినట్లు తెలిపారు టెంపుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ వినయ్ శర్మ. హిందూ సంస్థలు ముస్లింలకు వ్యతిరేకం అంటూ తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. కానీ ఇక్కడ ఓ ముస్లిం జంట పెళ్లి గుడిలో జరిగిందని, మునుషుల మధ్య రాజకీయం ఉండకూడదని ఆయన అన్నారు.  గుడిలోని ముస్లిం జంట పెళ్లికి రాంపూర్ గ్రామస్తులతోపాటు.. హిందూ పరిషత్ ప్రతినిధులు అందరూ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వధువు తండ్రి మాలిక్ మాట్లాడుతూ ‘నా కుటుంబానికి, నా కుమార్తె వివాహానికి విశ్వహిందూ పరిషత్, ఆలయ ట్రస్ట్, స్థానికులు ఎంతో అండగా నిలిచారు. దగ్గరుండి పెళ్లిని నడిపించారు’ అంటూ అభినందనలు తెలిపారు. హిందూ దేవుడి ఆలయంలో ముస్లిం మత ఆచారం ప్రకారం ఓ పెళ్లి జరగటం.. దేశంలోని మనుషులందరూ ఒక్కటే అని చాటిచెప్పిందంటున్నారు స్థానికులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..