AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: చికెన్ కర్రీలో ఎలుక పిల్ల.. ప్రముఖ హోటల్‌పై FDA దాడులు.. హోటల్‌ల్లోని వంటగదులు చూసి అధికారులు షాక్..

ఓ జంట ముంబైలోని ప్రముఖ పాపా పంచో రెస్టారెంట్‌కి భోజనం కోసం వెళ్ళింది. రోటీ, చికెన్, మటన్ కర్రీలు ఉన్న ప్లేట్ ను ఆర్డర్ చేశాడు. తాము ఆర్డర్ చేసిన ఫుడ్ ని తింటూ ఉండగా ఒకతని చూపు చికెన్ ముక్క మీద పడింది. చికెన్ కర్రీలో మిగతా చికెన్ ముక్కలకంటే.. ఒక చికెన్ ముక్క భిన్నంగా ఉన్నట్లు గుర్తించాడు. బాగా పరిశీలించగా అది.. చికెన్ ముక్క కాదు.. చనిపోయిన ఎలుక పిల్ల అని గుర్తించారు. దీంతో దంపతులు తాము తింటున్న ఆహారాన్ని వదిలేసి వెంటనే బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Mumbai: చికెన్ కర్రీలో ఎలుక పిల్ల.. ప్రముఖ హోటల్‌పై FDA దాడులు.. హోటల్‌ల్లోని వంటగదులు చూసి అధికారులు షాక్..
Rat Found In Food
Surya Kala
|

Updated on: Sep 15, 2023 | 12:45 PM

Share

హోటల్ లో ఫుడ్ ఇంటిలో వండే వంటల కంటే భిన్నంగా టెస్ట్ గా ఉంటాయని ఎక్కువమంది భావిస్తారు. ఎందుకంటే ఏ మాత్రం సమయం దొరికినా లేదా ఫ్యామిలీతో సరదాగా గడపాలన్న రెస్టారెంట్ కు వెళ్తారు. అక్కడ రకరకాల ఆహారాన్ని ఆస్వాదిస్తారు. అయితే ఇప్పుడు టేస్టీ ఫుడ్ కోసం హోటల్ కి వెళ్లాలంటే ఆలోచించే విధంగా ఒక సంఘటన చోటు చేసుకుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని ఓ ప్రముఖ హోటల్‌లో నాన్ వెజ్ డిష్‌లో చనిపోయిన ఎలుక పిల్ల కనిపించడంతో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబైలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దాడులు ప్రారంభించింది. ముంబైలోని ప్రసిద్ధ హోటళ్లలో, రెస్టారెంట్లలో తినడానికి సాధారణ పౌరుల నుంచి వివిధ దేశాల నుంచి ముంబైలో అడుగు పెట్టిన వారు కూడా వెళ్తారు. అయితే ఇలాంటి  హోటళ్లలోని వంటశాలలు అపరిశుభ్రంగా ఉంటాయని ఎవరూ ఊహించి ఉండరు.

ఇటీవల ఓ జంట ముంబైలోని ప్రముఖ పాపా పంచో రెస్టారెంట్‌కి భోజనం కోసం వెళ్ళింది. రోటీ, చికెన్, మటన్ కర్రీలు ఉన్న ప్లేట్ ను ఆర్డర్ చేశాడు. తాము ఆర్డర్ చేసిన ఫుడ్ ని తింటూ ఉండగా ఒకతని చూపు చికెన్ ముక్క మీద పడింది. చికెన్ కర్రీలో మిగతా చికెన్ ముక్కలకంటే.. ఒక చికెన్ ముక్క భిన్నంగా ఉన్నట్లు గుర్తించాడు. బాగా పరిశీలించగా అది.. చికెన్ ముక్క కాదు.. చనిపోయిన ఎలుక పిల్ల అని గుర్తించారు. దీంతో దంపతులు తాము తింటున్న ఆహారాన్ని వదిలేసి వెంటనే బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ముంబైలోని ప్రముఖ హోటల్‌పై దాడి

ఈ విషయం క్షణాల్లో ముంబై నగరంలో చక్కర్లు కొట్టింది. ఎఫ్‌డీఏ దృష్టికి చేరుకుంది. సీరియస్‌గా తీసుకున్న ఎఫ్‌డీఏ బృందం రంగంలోకి దిగింది. ముంబైలోని పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లపై ఇప్పుడు ఆ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఎఫ్‌డీఏ కేవలం హై-ఫై హోటళ్లపైనే కాదు చిన్న, పెద్ద హోటళ్లపై కూడా నిఘా ఉంచింది.

ఇవి కూడా చదవండి

ముంబైలోని బడే మియాన్ అనే హోటల్‌పై ఎఫ్‌డీఏ అధికారులు బుధవారం దాడి చేశారు. ఈ హోటల్ దక్షిణ ముంబైలోని కొలాబాలో ఉంది. ఈ హోటల్ కిచెన్‌కు ఎలాంటి లైసెన్స్ లేదని తెలిసింది. సంబంధిత హోటల్‌లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐఏ అనుమతి లేకుండా ఆహారం అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా హోటల్ వంటగది మురికిగా ఉంది. అందులో బొద్దింకలు, ఎలుకలు కనిపించాయి. దీంతో అధికారులు చర్యలు ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!