సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సూసైడ్ పైనా దర్యాప్తు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ ఆత్మహత్య పైనా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతికి సంబంధించి సాక్ష్యాధారాలను గానీ..

సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సూసైడ్ పైనా దర్యాప్తు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ ఆత్మహత్య పైనా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతికి సంబంధించి సాక్ష్యాధారాలను గానీ, సమాచారాన్ని గానీ ఇవ్వాలని ముంబై ఖాకీలు ప్రజలను కోరారు. జూన్ 8 న ఆమె ముంబై మలాద్ లోని తన అపార్ట్ మెంట్ పై నుంచి కిందకు దూకి సూసైడ్ కి పాల్పడింది. అయితే దీన్ని స్థానిక పోలీసులు యాక్సిడెంటల్ డెత్ గా కేసు నమోదు చేశారు. కానీ ఇప్పుడు దిశా మృతిపై సమగ్ర దర్యాప్తు జరగాలని వారు భావిస్తున్నారు. సుశాంత్ కేసును విచారిస్తున్న బీహార్ పోలీసులు ఈ కేసుపైనా దృష్టి సారించడంతో.. ముంబై ఖాకీలు కూడా ఈ ఆలోచన చేస్తున్నారు.

దిశాది ఆత్మహత్య కాదని ఆమెది హత్యేనని బీజేపీ నేత నారాయణ్ రాణే నిన్న వ్యాఖ్యానించారు. బహుశా అంతకుందు ఆమెపై అత్యాచారం జరిగి ఉండవచ్ఛునన్నారు. పోస్ట్ మార్టం రిపోర్టులో ఆమె ప్రైవేటు భాగాలపై గాయాలు ఉన్నట్టు తేలిందన్నారు. సుశాంత్ ని హత్య చేశారని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే.

 

Click on your DTH Provider to Add TV9 Telugu