ముంబై మర్డర్‌ కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌.. మృతదేహం దుర్వాసన రాకుండా ఉండేందుకు ఏం చేశాడంటే..!

|

Jun 12, 2023 | 3:58 PM

ముంబైలో సంచలనం రేపిన సరస్వతి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణలో నిందితుడు మనోజ్‌ షాకింగ్‌ విషయాలు వెల్లడించాడు. నేరం నుంచి తప్పించుకోవడానికి మనోజ్‌ వేసిన ప్లాన్లు క్రైం థ్రిల్లర్‌ మువీని తలపించేలా ఉన్నాయి...

ముంబై మర్డర్‌ కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌.. మృతదేహం దుర్వాసన రాకుండా ఉండేందుకు ఏం చేశాడంటే..!
Mumbai Murder Case
Follow us on

Mumbai Murder Case: ముంబైలో సంచలనం రేపిన సరస్వతి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణలో నిందితుడు మనోజ్‌ షాకింగ్‌ విషయాలు వెల్లడించాడు. నేరం నుంచి తప్పించుకోవడానికి మనోజ్‌ వేసిన ప్లాన్లు క్రైం థ్రిల్లర్‌ మువీని తలపించేలా ఉన్నాయి.

ముంబైలోని మీరా రోడ్ ప్రాంతంలో 56 ఏళ్ల మనోజ్ సానే తనతో సహజీవనం చేస్తోన్న సరస్వతి అనే మహిళను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈకేసులో నిందితుడు మనోజ్‌ రోజుకో కట్టుకథను అల్లి పోలీసులకు చెబుతూ నాటకాలుతున్నాడు. తాజాగా ఈ హత్య కేసులో హృదయ విదారక పరిణామం బయటపడింది. మృతురాలు సరస్వతి జుట్టును నిందితుడు కత్తిరించి తన ప్లాట్‌లోని వంటగదిలో భద్రపరచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పోలీసులు మృతురాలి సోదరీమణులకు చూపించారు. వారు ఈ ఫొటోలను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. సరస్వతికి తన పొడవాటి జుట్టు అంటే ఎంతో ఇష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలికి నలుగురు సోదరీమణులు ఉన్నారు. నిందితుడు మనోజ్ సానేపై వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ సోదరిని దారుణంగా చంపిన మనోజ్‌ను కఠినంగా శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ అసలు కథ..

పోలీస్‌ కమిషనరేట్‌ మీరా భయందర్‌ వసాయి విరార్‌ మాట్లాడుతూ.. విచారణ సమయంలో సానే పొంతనలేని కథలు చెబుతున్నాడు. వాటన్నింటినీ పోలీసులు క్రాస్ వెరిఫికేషన్ చేశాం. జూన్‌ 4న సరస్వతి వైద్య హత్య చేసిన తర్వాత సరస్వతి మృతదేహాన్ని ఎలా పారవేయాలనే దానిపై గూగుల్‌లో వెతికాడు. అనంతరం స్థానిక హార్డ్‌వేర్‌ దుకాణం నుంచిఎలక్ట్రిక్ వుడ్ కట్టర్ (చైన్సా)ని కొనుగోలు చేశాడు. దానిని శరీరాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగించాడు. ఈ ప్రక్రియలో కలప కట్టర్ గొలుసు విరిగిపోయింది. మరమ్మత్తు కోసం తిరిగి అదే దుకాణానికి వెళ్లి రిపేర్‌ చేయించాడు. ఐతే తాను చేస్తున్న పని గురించి ఏలాంటి ఆధారాలు బయటపడకుండా చెక్క కట్టర్‌ను చాలా జాగ్రత్తగా శుభ్రం చేశాడు. మృతదేహం కుళ్ళిన వాసన రాకుండా ఉండేందుకు గూగుల్‌లో వెతికి.. స్థానిక దుకాణం నుంచి ఐదు బాటిళ్ల నీలగిరి ఆయిల్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి

మేము పెళ్లి చేసుకున్నం..: నిందితుడు మనోజ్

ఈ కేసులో మరోషాకింగ్‌ ట్విస్ట్ బయటపడింది. అదేంటంటే.. బోరివలిలోని ఓ గుడిలో సరస్వతిని తాను వివాహం చేసుకున్నట్లు మనోజ్‌ విచారణలో తెలిపాడు. దీనిని ధృవీకరించేందుకు వీరికి పెళ్లి చేసిన పూజారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. వీరి వివాహానికి సంబంధించిన ఇతర సాక్షుల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరి మధ్య వయసులో తేడా ఉండడంతో పరిచయస్తులు మాత్రమేనని చెబుతూ.. తమ పెళ్లి విషయాన్ని దాచిపెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. ఇలా సానే మీరారోడ్డులోని ఆకాశగంగ భవనంలో గత మూడేళ్లుగా ఆమెతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఇక మృతురాలిని, ఆమె కుటుంబ సభ్యుల డీఎన్‌ఏ నమునాలతో సరిపోల్చేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి సోమవారం పంపనున్నట్లు పోలీస్‌ కమిషనరేట్‌ మీరా భయందర్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.