ప్రియుడితో మైనర్ బాలికల శృంగారం తప్పుకాదు! హైకోర్టు సంచలన వ్యాఖ్
ముంబై హైకోర్టు మైనర్ బాలికలతో లైంగిక సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రియుడితో ఇష్టంతో సంబంధం పెట్టుకోవడం నేరం కాదని అభిప్రాయపడింది. 2019లో నమోదైన పోక్సో కేసు విచారణలో ఈ వ్యాఖ్యలు చేస్తూ నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ వ్యాఖ్యలపై కొంత మంది నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

మైనర్ బాలికలు వాళ్ల ఇష్టప్రకారం శృంగారం చేస్తే అది తప్పు కాదంటూ ముంబై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రియుడితో ఇష్టంగా రతిలో పాల్గొనడం తప్పు కాదని తేల్చిచెప్పింది. 2019లో ఓ వ్యక్తిపై పోక్సో చట్టం కింద నమోదైన కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. 24 ఏళ్ల యువకుడు మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. అతనికి ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం చర్చనీయాంశమైంది. బాధితురాలు మైనర్ అయినప్పటికీ పరస్పరం ఇష్టంతో శృంగారంలో పాల్గొన్నప్పుడు నిందితుడికి బెయిల్ ఇవ్వొచ్చని న్యాయమూర్తి జస్టిస్ మిళింద్ స్పష్టం చేశారు.
2019లో కేసు నమోదు అయినప్పుడు బాధిత బాలిక వయసు 14 ఏళ్లు, యువకుడికి 19 ఏళ్లు. ఇద్దరు ప్రేమించుకున్నారు, ఈ క్రమంలోనే ఆ బాలిక యువకుడితో మూడు రోజులు గడిపింది. ఈ క్రమంలో ఆమె పేరెంట్స్ యువకుడిపై లైంగిక దాడి కేసు పెట్టగా పోలీసులు అరెస్ట్ చేసి ఐదేళ్లు జైల్లో పెట్టారు. ఈ కేసు విచారణ శనివారం జరగగా.. బాలిక మైనర్ అయినప్పటికీ అన్నీ తెలిసే చేసినప్పుడు నేరంగా ఎలా పరిగణిస్తామంటూ హైకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు పిల్లలపై చెడు ప్రభావం చూపుతాయని కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




