రోడ్డుపై బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాల్సించే. లేకపోతే ట్రాఫిక్ పోలీసులకు దొరికితే ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఈ ట్రాఫిక్ నింబంధనలు అనేవి పేద, ధనిక, లింగ, వృతిపరంగా ఎటుంవంటి బేధాలు లేకుండా అందరికీ ఒకే రూల్ ఉంటుంది. హెల్మెట్ ధరించాలని ప్రజలకు చెప్పాల్సిన పోలీసులే హెల్మెట్ ధరించకుండా రోడ్ పై తిరిగితే ఎలా ఉంటుంది. ఇప్పుడు అలాంటిదే మహారాష్ట్రలో జరిగింది. ముంబయిలోని ఇద్దరు మహిళా పోలీసులు స్కూట్ పై హెల్మెట్ ధరించకుండా రోడ్ పై వెళ్లారు. దీన్ని రాహుల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది. చాలామంది నెటీజన్లు ఆ మహిళా పోలీసులపై తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే వాళ్ల ఫోటోను ట్విట్టర్ షేర్ చేసిన రాహుల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, అలాగే డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధికారికి ట్విట్టర్ ఖాతాలకు కూడా ట్యాగ్ చేశారు. ఆ తర్వాత దీనిపై ముంబయి పోలీసులు స్పందించారు. ఈ ఫోటో ఎక్కడ తీశారో కచ్చితమైన ప్రాంతాన్ని చెప్పాలని కోరగా.. రాహుల్ దాడర్ లోని ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే దగ్గర అంటూ సమాధానమిచ్చాడు. అనంతరం తాము మాతుంగా ట్రాఫిక్ డివిజన్ వారితో దీనిపై చర్యలు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అయితే చాలామంది నెటీజన్లు ఈ ట్విట్టర్ లో ఆ పోలీసుల చేసిన పనికి తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా ఇలాగే హెల్మెట్ లేకుండా వెళ్తే కొన్ని గంటల్లోనే తాము రిజస్టర్ చేసుకున్న మొబైల్ కు ఫైన్ వస్తుందని ఒకరు కామెంట్ చేశారు. ఈ ట్రాఫిక్ నిబంధనలు అనేవి చట్టసభ్యులకు, పోలీసులకు వర్తించవని..కేవలం సాధారణ ప్రజల కోసం మాత్రమే ఈ జరిమానాలు ఉంటాయంటూ మరొక నెటీజన్ రాసుకొచ్చారు.
MH01ED0659
What if we travel like this ?? Isn’t this a traffic rule violation ?@MumbaiPolice @mieknathshinde @Dev_Fadnavis pic.twitter.com/DcNaCHo7E7— Rahul Barman (@RahulB__007) April 8, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..