AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Shock: వీడెవడండి బాబు.. యజమానిపై కోపంతో కరెంట్ షాక్ ఇచ్చాడు

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోని యజమాని దురుసు ప్రవర్తన నచ్చకపోవడంతో ఓ వంట మనిషి తనకు విద్యుత్‌ షాక్‌ ఇవ్వడం కలకలం రేపింది. మహారాష్ట్రలోని ముంబయి నగరంలోని అంధేరిలో ఈ ఘటన జరిగింది. అయితే ఆ వంట మనిషి ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే అసలు విషయం తెలుసుకోవాల్సింది. ఇక వివరాల్లోకి వెళ్లినట్లైతే.. బేత్‌షీబా సేథ్‌ అనే మహిళ ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది.

Electric Shock: వీడెవడండి బాబు.. యజమానిపై కోపంతో కరెంట్ షాక్ ఇచ్చాడు
Electric Shock
Aravind B
|

Updated on: Sep 19, 2023 | 7:57 PM

Share

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోని యజమాని దురుసు ప్రవర్తన నచ్చకపోవడంతో ఓ వంట మనిషి తనకు విద్యుత్‌ షాక్‌ ఇవ్వడం కలకలం రేపింది. మహారాష్ట్రలోని ముంబయి నగరంలోని అంధేరిలో ఈ ఘటన జరిగింది. అయితే ఆ వంట మనిషి ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే అసలు విషయం తెలుసుకోవాల్సింది. ఇక వివరాల్లోకి వెళ్లినట్లైతే.. బేత్‌షీబా సేథ్‌ అనే మహిళ ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే తన ఇంట్లో వంట చేయడానికి ఆమె రాజు సింగ్‌ అనే ఒక వ్యక్తిని నియమించుకుంది. అయితే అతడు పని సరిగా చేయటం లేదని ఆమె ఓ సారి అతడిపై దురుసుగా ప్రవర్తించింది. దీంతో రాజు సింగ్‌ ఆమె అతనిపై అలా ప్రవర్తించడం తట్టుకోలేకపోయాడు. ఆ యజమానిపై కోపం పెంచుకున్నాడు.

అయితే ఈ నేపథ్యంలోనే ఆదివారం మధ్యాహ్నం పూట ఆమె నివసించే ఫ్లాట్‌కు వెళ్లాడు రాజ్ సింగ్. తన దగ్గర ఉన్నటువంటి అదనపు తాళం చెవితో ఇంటి తలుపులు తెరిచేశాడు. అయితే ఆ సమయంలో బేత్‌షీబా సేథ్‌ నిద్ర పోతోంది. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారంగానే.. ఆ వంట మనిషి రాజు సింగ్‌ విద్యుత్ బోర్డులోని సాకెట్‌లో వైర్లు ఉంచి ఓ సారి ఆమెకు ఒక్కసారిగా కరెంటు షాక్‌ ఇచ్చాడు. దీంతో ఆమె ఉలిక్కిపడి లేచింది. ఏమైందోనని చుట్టుపక్కల చూసింది. అయితే ఆమె నిద్ర లేవగానే ఇప్పుడు ఎలా ఉందంటూ ఆ నిందితుడు ఆమెను ప్రశ్నించాడు. అంతేకాదు ఆమెపై అలా వరుసగా కొన్నిసార్లు షాక్ ఇచ్చాడు. దీంతో సేథ్ ఆ కరెంట్ షాక్ చిత్రహింసలను భరించలేకపోయింది. ఇక రాజు సింగ్‌తో వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య గొడవ జరగుతుండగా.. రాజు సింగ్ ఆమె గొంతు నులిమేందుకు ప్రయత్నించాడు.

అయితే ఈ బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆ అరుపులు విని పక్క గదిలో నిద్రపోతున్న ఆమె కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. అయితే ఆ వంట మనిషి తన కొడుక్కి కూడా ఏదైనా హాని చేస్తాడేమోనని అనుకుని ఆ బాలుణ్ని ఇక్కడి నుంచి పారిపొమ్మని చెప్పింది . అయితే కొద్ది సేపటి తర్వాత ఆ నిందితుడు బాధితురాలికి క్షమాపణలు చెప్పాడు. నేను ఇలా చేసి ఉండాల్సింది కాదని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఈ దాడి గురించి సేథ్‌ తన స్నేహితులకు ఫోన్‌ చేసి చెప్పింది. దీంతో వెంటనే వారు ఆమె ఫ్లాట్‌ వద్దకు వచ్చేశారు. ఇక చివరికి ఈ ఘటనపై అంబోలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. త్వరలోనే నిందితుడ్ని పట్టుకుంటామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..