Watch: దసరా రోజు కొత్త కారు కొనేందుకు వెళ్తుండగా దారుణం.. తల్లిదండ్రుల ముందే అతి కిరాతకంగా..
దసరా రోజు కొత్త కారు కొనేందుకు ఓ యువకుడు తల్లిదండ్రులతో కలసి బయలుదేరాడు.. ఈక్రమంలోనే.. ఓ ఆటోను ఓవర్ టెక్ చేశాడు.. దీంతో ఆటో డ్రైవర్.. అతని మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. దీంతో ఆటో రిక్షా డ్రైవర్ తన సహచరులతో కలిసి ఆకాష్‌పై దాడి చేయడంతో తీవ్ర గాయాలై మరణించాడు..
మరీ ఇంత దారుణమా.. చిన్న వివాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. ఓవర్‌టేక్ చేసినందుకు ఓ వ్యక్తిని ప్రాణంపోయేలా కొట్టారు. ఈ దారుణ ఘటన ముంబైలో దసరా పండుగ రోజు (శనివారం) జరిగింది. మహరాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్త ఆకాశ్‌మీన్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులతో కలిసి పని నిమిత్తం ఇంటి నుంచి కారులో బయటకు వెళ్లారు. ఈ సమయంలో మలాడ్ రైల్వే స్టేషన్ సమీపంలో వాహనం ఓ ఆటోను ఓవర్‌టెక్ చేసింది.. దీంతో ఆటోడ్రైవర్ ఆకాశ్ తో గొడవపడ్డాడు.. ఈ విషయంలో వారి మధ్య వివాదం చెలరేగింది. ఇద్దరూ పరస్పరం వాగ్వాదానికి దిగారు. అనంతరం అక్కడ్నుంచి వెళ్లిపోయిన ఆటోడ్రైవర్ తన స్నేహితులతో వచ్చి ఆకాశ్‌పై మళ్లీ దాడికి దిగాడు. వీరంతా కలిసి పిడిగుద్దులు కురిపించారు. దెబ్బలు తాళలేక ఆకాశ్ అక్కడే కింద పడిపోయాడు. అయినప్పటికీ వారు అతనిని వదిలిపెట్టకుండా కొడుతూనే ఉన్నారు. కొడుకుపై దాడి చేస్తుండడంతో వాళ్లను ఆపేందుకు ఆకాశ్ తల్లిదండ్రులు తీవ్ర ప్రయత్నం చేశారు. అయినప్పటకీ వినకుండా దుండగులు వారినీ కూడా తీవ్రంగా కొట్టారు. అంతమంది కలిసి దాడి చేయడంతో ఆకాశ్ మీన్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అతడిని స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ చనిపోయాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా అక్టోబర్ 22 వరకూ వారిని పోలీస్ కస్టడీకి అప్పగించారు.
వీడియో చూడండి..
కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే.. ఆకాష్ దసరా రోజున కొత్త కారు కొనుక్కోవడానికి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగిందని.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..