Election Commission: ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం.. ఎగ్జిట్‌పోల్స్‌కు శాస్త్రీయత లేదు: సీఈసీ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఈవీఎంల ట్యాంపరింగ్, ఎగ్జిట్ పోల్స్, ఎర్లీ ట్రెండ్స్ పై సీఈసీ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణల నేపథ్యంలో .. రాజీవ్ కుమార్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఎగ్జిట్‌పోల్స్ ఆధారంగా తమపై నిందలు వేయడం అర్థరహితం అంటూ పేర్కొన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని.. కాంగ్రెస్ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలవేళ ఈవీఎం (EVM) లపై దుమారం మొదైలంది.. హర్యానా ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంలపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తంచేస్తోంది. బ్యాలెట్ ఎన్నికల కోసం పట్టుబట్టాలంటూ కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.. అయితే.. ఈవీఎం లపై అనుమానాలను కొట్టిపారేసిన సీఈసీ రాజీవ్‌కుమార్.. కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించారు. మహారాష్ట్ర, జార్ఖండ్, దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన సీఈసీ రాజీవ్ కుమార్.. తమపై నిందలు అర్థరహితం అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవీఎంల ట్యాంపరింగ్, ఎగ్జిట్ పోల్స్‌పై సీఈసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్‌పోల్స్‌కు శాస్త్రీయత లేదని.. ఎగ్జిట్‌పోల్స్ కేవలం అంచనాలు మాత్రమేనంటూ సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఎగ్జిట్‌పోల్స్ ప్రజలను గందరగోళ పరుస్తున్నాయని.. వీటిలో ఎన్నికల సంఘం ప్రమేయం ఉండదంటూ స్పష్టంచేశారు. ఎగ్జిట్‌పోల్స్ ప్రకటనలో స్వీయనియంత్రణ అవసరమన్న సీఈసీ.. ఎగ్జిట్‌పోల్స్ ఆధారంగా తమపై నిందలు వేయడం అర్థరహితమన్నారు. ఈవీఎంలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనని.. సీఈసీ మండిపడ్డరాు. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని.. 6 నెలల ముందే ఈవీఎం మిషన్లను పరిశీలిస్తామని పేర్కొన్నారు. పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే EVMలు ఉపయోగిస్తామని సీఈసీ పేర్కొన్నారు. పోలింగ్‌కు 5రోజుల ముందే బ్యాటరీలు అమరుస్తామని.. మూడెంచల భద్రత మధ్య ఈవీఎంలు ఉంటాయన్నారు. నచ్చని ఫలితాలు వచ్చినప్పుడే ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారని.. ఈవీఎంలలో బ్యాటరీలు ఒకేసారి ఉపయోగిస్తామని వివరించారు.. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమంటూ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ తోపాటు.. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన 15-30 నిమిషాలలోపు టీవీ ఛానెల్‌లలో చూపించిన ముందస్తు ట్రెండ్‌లను కూడా నమ్మవద్దని సీఈసీ రాజీవ్ కుమార్ సూచించారు. 9.30 తర్వాత అసలైన ట్రెండ్స్ వెలువడతాయని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ కారణంగా వక్రీకరణ, స్వీయ ఆత్మపరిశీలన అవసరం అంటూ పేర్కొన్నారు.
కాగా.. హర్యానాలో ఓటమి షాక్ నుంచి కోలుకోలేకపోతున్న కాంగ్రెస్, ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై మరింత ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్‌నేత రషీద్ అల్వీ సంచలన ఆరోపణలు చేశారు. ఇజ్రాయెల్‌కు, మోదీకి, EVMకి లింక్ పెట్టి, కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ పొలిటికల్ బాంబింగ్ చేశారు. ఈవీఎం టెక్నాలజీలో ఇజ్రాయెల్‌కు మంచి నైపుణ్యం ఉందని, ప్రధానికి ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఈవీఎంల ఆట ఎక్కడినుంచైనా ఆడవచ్చనీ, ఎన్నికల ముందే బీజేపీ ఇదంతా చేస్తుందని రషీద్ అల్వీ అనుమానం వ్యక్తం చేశారు. కాగా.. కాంగ్రెస్ ఆరోపణలకు కేంద్ర ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఈవీఎంలపై వివరణ ఇచ్చిన కేంద్ర ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్.. ఈవీఎంలలో లోపాలు లేవనీ, 100శాతం సేఫ్ అని చెప్పారు. ఇదిలాఉంటే.. కాంగ్రెస్ ఆరోపణలకు బీజేపీ నేత షెహజాద్ పూనావాలా కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందే ఓటమిని కాంగ్రెస్ అంగీకరించిందని పూనావాలా వ్యాఖ్యానించారు. పేజర్లలా EVMలను హ్యాక్ చేయవచ్చని కాంగ్రెస్ అంటోందని తప్పుబట్టారు.. తెలంగాణ, కర్నాటకల్లో గెలిచినపుడు మాత్రం EVMల మీద కాంగ్రెస్ ఆరోపణలు చేయలేదన్నారు.ఓటమి అంచున నిలబడిన కాంగ్రెస్, తమ నాయకుడు రాహుల్‌ను కాపాడటానికే EVMలపై నిందలేస్తోందని పూనావాలా విమర్శించారు.
వీడియో చూడండి..
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీతోపాటు.. ఉప ఎన్నికల తేదీలివే..
కాగా.. మహారాష్ట్రలో 288, జార్ఖండ్ 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. నవంబర్ 20న మహారాష్ట్ర ఎన్నికలు జరగనుండగా.. 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.. జార్ఖండ్ ఎన్నికలు రెండు దశల్లో జరుగనున్నాయి.. నవంబర్ 13, 20న జార్ఖండ్ ఎన్నికలు, 23న ఫలితాలు వెలువడనున్నాయి.. నవంబర్ 13న 43 స్థానాలకు ఎన్నికలు, నవంబర్ 20న 38 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదలచేసింది.. మొత్తం 48 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.. నవంబర్ 13న 47 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానానికి ఉపఎన్నిక, నవంబర్ 20న ఒక అసెంబ్లీ, ఎంపీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. నవంబర్ 23న ఉప ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..