AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India’s Best Couple: మన దేశంలో పవర్‌ఫుల్‌ కపుల్‌ ఎవరో తెలుసా? ఇంట్రస్టింగ్ సర్వే మీకోసం..!

India's Best Couple: మన దేశంలో పవర్‌ఫుల్‌ కపుల్‌ ఎవరో తెలుసా..? కనీసం అంచనా అయినా చేయగలరా..? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం.. పవర్‌ఫుల్‌ కపుల్స్‌ పేరుతో ఇండియన్

India's Best Couple: మన దేశంలో పవర్‌ఫుల్‌ కపుల్‌ ఎవరో తెలుసా? ఇంట్రస్టింగ్ సర్వే మీకోసం..!
Mukesh And Nitha
Shiva Prajapati
|

Updated on: Dec 10, 2021 | 7:54 AM

Share

India’s Best Couple: మన దేశంలో పవర్‌ఫుల్‌ కపుల్‌ ఎవరో తెలుసా..? కనీసం అంచనా అయినా చేయగలరా..? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం.. పవర్‌ఫుల్‌ కపుల్స్‌ పేరుతో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్‌ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. దేశంలో పవర్‌ఫుల్‌ కపుల్ ఎవరనేదానిపై ఈ సర్వే జరిగింది. ఈ సర్వేలో టాప్‌ప్లేస్‌లో నిలిచారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ. వీరికి 94శాతం ఆమోదం లభించింది. ఇక బాలీవుడ్‌ జంట రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకునేకి రెండో స్థానం లభించింది. వీరికి 86శాతం మంది పవర్‌ఫుల్‌ కపుల్‌గా ఓటేశారు. ఇక మూడో ప్లేస్‌లో భారత టెస్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్కాశర్మ జంట నిలిచింది. వీరికి 79శాతం మంది ఆమోదుముద్ర వేశారు. 2019లో విరుష్క జంట టాప్‌ప్లేస్‌లో నిలిచింది. అయితే వీరికి ఇటీవల కూతురు పుట్టడంతో.. ఎక్కువ మీడియాకు కూడా ఎక్స్‌పోజ్‌ కాలేదు. మరోవైపు కోహ్లీ సరైన ఫామ్‌లో లేకపోవడం.. కెప్టెన్సీని కోల్పోవడం.. అనుష్క సినిమాలు కూడా చేయకపోవడంతో మూడో స్థానానికి పడిపోయిందీ జంట.

ఇప్పటివరకు దేశంలో ఉన్న బలమైన కుటుంబాలే కాకుండా.. కొత్త వధూవరులు, కాబోయే జంటలను కూడా ఈ సర్వేలో ఉంచారు. దీంతో త్వరలోనే ఒక్కటి కానున్న రణబీర్‌ కపూర్‌, ఆలియాభట్‌ జంటకు 72శాతం జనామోదం లభించి నాలుగో స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 25 నుంచి 40 సంవత్సరాల వయస్సులో ఉన్న 1,362 మంది ఈ సర్వేలో పాల్గొన్నారని ఐఐహెచ్‌బీ వెల్లడించింది. ఈ సంస్థ 2019లో చివరిసారిగా పవర్ కపుల్ ర్యాంకులను విడుదల చేసింది. 2020లో కరోనా కారణంగా సర్వేకు దూరమైంది. ఇక నిన్ననే పెళ్లి బంధంతో ఒక్కటైన విక్కీ కౌశల్‌, కత్రినాకైఫ్‌ జంటకు 48శాతం మార్కులు పడ్డాయి. ఈ జంట తొమ్మిదో స్థానంలో నిలిచింది. వీరికన్నా ముందు అక్షయ్‌, ట్వింకిల్‌. షారుఖ్‌, గౌరీఖాన్‌. సైఫ్‌, కరీనాకపూర్‌ ఖాన్‌. అమితాబ్‌, జయాబచ్చన్‌ ఉన్నారు.

Also read:

Indian Railway: ఇక నుంచి సీనియర్ సిటిజన్స్‎కు రాయితీ ఉండదు.. పలు రాయితీలు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి ప్రకటన..

Bigg Boss 5 Telugu: సిరి పై షణ్ముఖ్ అలక.. నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ హగ్గు.. మళ్లీ మొదలెట్టేశారుగా..

Road Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ బోల్తా పడి 22 మందికి తీవ్రగాయాలు..