AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: ఇక నుంచి సీనియర్ సిటిజన్స్‎కు రాయితీ ఉండదు.. పలు రాయితీలు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి ప్రకటన..

భారతీయ రైల్వే ఇక నుంచి ఛార్జీలలో సీనియర్ సిటిజన్ రాయితీలతో సహా ఇతర ప్రయాణికులకు రాయితీ టిక్కెట్లను ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్ & ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్‎లో చెప్పారు...

Indian Railway: ఇక నుంచి సీనియర్ సిటిజన్స్‎కు రాయితీ ఉండదు.. పలు రాయితీలు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి ప్రకటన..
Trains
Srinivas Chekkilla
|

Updated on: Dec 10, 2021 | 7:29 AM

Share

భారతీయ రైల్వే ఇక నుంచి ఛార్జీలలో సీనియర్ సిటిజన్ రాయితీలతో సహా ఇతర ప్రయాణికులకు రాయితీ టిక్కెట్లను ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్ & ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్‎లో చెప్పారు. శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కోవిడ్ మహమ్మారి, ప్రోటోకాల్‌ల దృష్ట్యా ఈ రాయితీని ఇవ్వలేమన్నారు. నాలుగు కేటగిరీల దివ్యాంగులు,11 కేటగిరీల రోగులు, విద్యార్థులు మినహా అన్ని కేటగిరీలకు రైల్వే యొక్క రాయితీ టిక్కెట్ సౌకర్యం రద్దు చేసింది.

మార్చి 2020కి ముందు, సీనియర్ సిటిజన్ల విషయంలో, అన్ని తరగతులలో రైల్వేలో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు 50% పురుషులకు 40% తగ్గింపు ఇచ్చారు. ఈ రాయితీ పొందాలంటే వయో పరిమితి వృద్ధ మహిళలకు 58 , పురుషులకు 60 సంవత్సరాలు ఉండాలి. భారతీయ రైల్వేలు సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, క్రీడాకారులు, వైద్య నిపుణులు మొదలైన వారితో సహా 53 వర్గాలకు రాయితీలను అందిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా కొన్ని రాయితీలు తీసేశారు. ప్రస్తుతం, విద్యార్థులు, కొన్ని వైద్య పరిస్థితులు ఉన్న వ్యక్తులు మాత్రమే రాయితీకి అర్హులు. భారతీయ రైల్వే ఫోటోగ్రాఫ్‌, సంతకాన్ని అప్‌లోడ్ చేయడం, దరఖాస్తు స్థితిని తనిఖీ చేయడం కోసం సవరణ లింక్‌కు సంబంధించి ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల (RRBs) యొక్క అన్ని అధికారిక వెబ్‌సైట్‌లలో డిసెంబర్ 15 నుండి సవరణ లింక్ అందుబాటులోకి వస్తుంది.

Read Also… Oneplus Mobile: వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. భారీగా తగ్గింపు..!

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!