Mudra Loans: సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? రూ. 10 లక్షల వరకు ప్రభుత్వ రుణం.. ఇలా పొందండి..
యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంలో కేంద్రం ప్రభుత్వం ముద్రా పథకం కింద ఇప్పటి వరకు రూ.20 లక్షల కోట్ల రుణాలు అందించిందని

యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంలో కేంద్రం ప్రభుత్వం ముద్రా పథకం కింద ఇప్పటి వరకు రూ.20 లక్షల కోట్ల రుణాలు అందించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గురువారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ముద్రా పథకం ఆవశ్యకతను వివరించారు. 75,000 మందికి ఉపాధి కల్పించాలనే మహారాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని.. తమ ప్రభుత్వం స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమలకు కూడా సహాయం అందిస్తోందని చెప్పుకొచ్చారు.
ప్రధాన మంత్రి ముద్ర యోజన..
ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) పథకాన్ని మోడీ ప్రభుత్వం ఏప్రిల్ 2015లో కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న/సూక్ష్మ పరిశ్రమలకు రూ.10 లక్షల వరకు రుణాలను అందించడానికి ప్రారంభించింది. ఈ పథకం కింద వ్యాపార ఔత్సాహికులకు ప్రభుత్వం మద్ధతులో రుణాన్ని ఇస్తారు. ఆ రుణ సాయంతో వ్యక్తులు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయచ్చు. మీరు కూడా స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్లయితే.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ముద్ర రుణ పథకం ఉత్తమం అని చెప్పవచ్చు. ముద్రా రుణం వివిధ ప్రయోజనాల కోసం పొడిగించడం జరిగింది. ఆదాయ ఉత్పత్తి, వ్యాపారులు, దుకాణదారులు, ఇతర సేవా రంగ కార్యకలాపాలకు రుణం ఇవ్వడం జరిగుతుంది. తద్వారా ఉపాధి కల్పన జరుగుతుంది.
ముద్ర లోన్ ఎలా తీసుకోవాలి?
PMMY లోన్‌లు మెంబర్ లెండింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ ద్వారా పొడిగించబడ్డాయి. ముద్రా లిమిటెడ్‌తో రిజిస్టర్ చేయబడిన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లలో కూడా తీసుకోవచ్చు. ముద్ర లోన్ కింద వ్యాపారం కోసం రూ. 10 లక్షల వరకు రుణాలను పొందవచ్చు. ప్రధాన్ మంత్రి ముద్రా యోజన కింద బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల పథకం ద్వారా రుణాలను మూడు విభాగాలుగా అందజేస్తారు. ఒక ‘శిశు’ పేరుతో రూ. 50 వేల వరకు రుణాలు అందిస్తారు. రెండు ‘కిషోర్’ పేరుతో రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు ఇస్తారు. ఇక ‘తరుణ్’ పేరుతో రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రుణాలు అందజేస్తారు.
జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..