రిజర్వేషన్లపై మోహన్ భగవత్ వ్యాఖ్యలు … ఆర్ఎస్ఎస్ వివరణ
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఆదివారం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్ధ శిక్షా సంస్కృతి ఉత్తాన్ ఆధ్వర్యంలో జరిగిన ఙ్ఞాన్ ఉత్సవ్‌లో ఆయన రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. రిజర్వేషన్ల అంశంపై చర్చలు జరిగిన ప్రతిసారి ఘాటు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని, ఈ విషయంలో అనుకూలంగా ఉన్నవారు, వ్యతిరేకంగా ఉన్నవారు ఎదుటి పక్షం ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని చర్చించాలన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాద్ధాంతం చేస్తున్నారని ఆర్ఎస్ఎస్ […]
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఆదివారం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్ధ శిక్షా సంస్కృతి ఉత్తాన్ ఆధ్వర్యంలో జరిగిన ఙ్ఞాన్ ఉత్సవ్‌లో ఆయన రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. రిజర్వేషన్ల అంశంపై చర్చలు జరిగిన ప్రతిసారి ఘాటు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని, ఈ విషయంలో అనుకూలంగా ఉన్నవారు, వ్యతిరేకంగా ఉన్నవారు ఎదుటి పక్షం ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని చర్చించాలన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాద్ధాంతం చేస్తున్నారని ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యానించింది. దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లకు తాము ఎప్పుడూ మద్దతుగానే ఉన్నామని ఆర్ఎస్ఎస్ నేషనల్ పబ్లిసిటీ చీఫ్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు. మోహన్ భగవత్‌ను అడిగిన ప్రశ్నకు సమాధానంగానే ఆయన జవాబిచ్చారని.. దీన్ని కొంతమంది రాజకీయం చేయడం తగదన్నారు.